రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కేసు నమోదు  చేసి విచారణ  చేపట్టిన పోలీసులు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నల్లబోతుల బాల వెంకటేశ్వర్లు (24) సంఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. ఇతనిది రాచర్ల మండలం ఆకవీడు గ్రామం. మార్కాపురంలో బైక్ లైసెన్సు అప్లై చేసుకొని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణంలో స్వగ్రామం ఆకవీడు తిరిగి వస్తుండగా బెస్తవారిపేట నుండి శ్రీశైలంకు వెళ్తున్న కార్ ఢీ కొట్టిన సంఘటనలో నల్లబోతుల వెంకటేశ్వర్లు (24) ఘటన స్ధలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న కంభం పోలీసులు విచారణ చేపట్టారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: