రిజిస్ట్రేషన్ కు ఒక్క రూపాయి ఇవ్వద్దు

కందుల నారాయణరెడ్డి


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

పక్కా గృహాల రిజిస్ట్రేషన్లకు ఎవరు ఒక్క రూపాయి చెల్లించొద్దు -రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వ హయాం నుంచి వివిధ  ప్రభుత్వాలు  పేదలకు ఇచ్చిన పక్కా గృహాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అంటూ ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్కో పక్కా గృహానికి పదివేల రూపాయలు చెల్లించాలంటూ  1500 కోట్ల రూపాయలు పేదల నుండి కొట్టేసే స్కెచ్ వేశారని గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నుండి రిజిస్ట్రేషన్ ఫీజు ముక్కు  పిండి వసూలు చేయాలని హుకుం జారీ చేసిందని వారు పేదలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పేద  ప్రజలు  వాపోతున్నారని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వం వివిధ రకాల విచిత్రమైన పన్నులతో ప్రజల రక్తాన్ని జలగల వలె పీలుస్తున్నారని వాపోయారు.  పక్కా  గృహాల లబ్ధిదారులు రిజిస్ట్రేషన్లకు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించ వద్దని రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పక్క గృహాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఉద్ఘాటించారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: