హడ తెతిస్తున్న గ్రామ సింహాలు

రోడ్డెక్కాలంటే  వణుకుడే

చికెన్ సెంటర్ల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న గ్రామ సింహాలు

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా ,పాణ్యం నియోజకవర్గం ,గడివేముల మండలం లో ని రహదారులపై నడవాలన్న ,ద్విచక్ర వాహనాలపై వెళ్లాలన్నా , ప్రజలువెళ్లాలన్నా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లవలసిన పరిస్థితి గడివేముల మండలం లోని రహదారులపై నిత్యం దర్శనమిస్తుంటాయి. గడివేముల లోని కొత్త బస్టాండ్ కు వెళ్లి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఈ ప్రధాన రహదారులపై వెళ్లి ఎక్కవలసి ఉంటుంది, అంతేకాకుండా గడివేముల నుండి ద్విచక్ర వాహనదారులు నంద్యాల వెళ్లాలన్న, నందికొట్కూరు కు వెళ్లాలి అన్న, ఈ ప్రధాన రహదారుల పైన వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రధాన రహదారులకు ఇరువైపులా చికెన్ సెంటర్ లు ఉండడం తో గ్రామ సింహాలు(వీధి కుక్కలు) గుంపులుగుంపులుగా ప్రధాన రహదారి పైన నిలబడి ఉంటాయి.

ద్విచక్ర వాహనాలకు, బాటసారులకు, ప్రధాన రహదారిపై  అడ్డంగా ఉన్న గ్రామ సింహాలు 


ప్రాథమిక మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ , జూనియర్ కళాశాలకు ,  విద్యార్థిని ,విద్యార్థులు , భయం ,భయం గానే, ఈ ప్రధాన రహదారి పైనే వెళ్తున్నారు. గ్రామ సింహాలు ద్విచక్ర వాహనాలకు అడ్డంగా వెళ్లి ద్విచక్ర వాహనదారులు క్రిందపడి కొందరికి గాయాల బారిన పడిన సంఘటనలు, కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు, అనేకం ఉన్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు ,సిబ్బంది, చూసి చూడనట్లు వివరిస్తారని ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు ,సిబ్బంది,గ్రామ సింహాల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులు,బాటసారులు,ద్విచక్ర వాహనదారులు, కోరుకుంటున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: