ఈ శ్రమ కార్డుల కొరకు...

 మీసేవా సెంటర్ల లో దరఖాస్తు చేసుకోండి 


(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)

 కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన ఈ శ్రమ పధకం ద్వారా ఈ శ్రమ కార్డుల కొరకు  మీసేవా సెంటర్ల లోఆప్లై చేసుకో వలసినదిగా “ జానో - జాగో “ ముస్లీమ్ మైనారిటీల అభివృద్ధి సంస్ధ రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ పథకం యొక్క అర్హులు తాపి పనివారు , ఆటో,కార్ డ్రైవర్ లు, సెంట్రింగ్ పని వారు,, ముఠా పనివారు , కాయగూరలు , పండ్లు అమ్మేవారు, టిఫిన్ బండ్లు వేసే వారు‌ , ఇళ్ళలో పని చేసేవారు, సెక్యురిటీ గార్డ్స్, ఆశా వర్కలు, ఆయాలు , మెకానిక్ రిపేర్లు చేసేవారు , సేల్స్ మేన్ లు , మార్కెట్ ఏజంట్స్ , షాపింగ్ లో పనిచేసేవారు తదితరులు చాలామంది ఉన్నారు వీరందరికీ వారి పనికి గుర్తింపు కార్డులు అంటే *ఈ శ్రమ్ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ వారు అందించడం జరుగుతుందని, 

ఈ కార్డు వలన ఉపయోగాలు*

1. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు కలవారు అర్హులు.

2. ఈ కార్డు ఉన్నవారు కి 60 సంవత్సరాల దాటిన వారికి 3000/- పించన్ గా లభిస్తుంది.

3. 2లక్షల ప్రమాద భీమా

4. ఈ కార్డులు ఉన్నవారికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.

5. ఈ కార్డులు ఉన్న వారికి కార్మికుల వివరాలు మరియు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం. 

6. ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర విపత్తుల సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.

7. ఈ కార్డు కి ఆధార్ నెంబర్ వలె 12అంకెల కోడ్ అంటే UID నెంబర్ ఇవ్వడంతో పాటు వారు ఏచోటికి పనికి వెళ్ళిన వారు ఆ నెంబర్ ఆధారంగా వివరాలు ఆన్లైన్ లో ఉండడం వల్ల వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది.

కావున ప్రతి ఒక్క చేతివృత్తుల పనివారు అందరూ ఈ ఈశ్రమ్ కార్డు లు ఆన్లైన్ చేయించుకొని ఈ కార్డు ను పొందగలరు. ఈ కార్డు కావలసిన వారు దగ్గర లో ఉన్న మీసేవా సెంటర్స్ లో ఆన్లైన్ చేయించుకోగలరని తెలియచేశారు.

ఆన్లైన్ కు కావలసినవి:- 

1. ఆధార్ కార్డు (ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండవలెను.)

2. బ్యాంక్ ఏకౌంట్

3. నామిని ఆధార్ కార్డు

4. ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబరు. 

 పూర్తి వివరాల కొరకు  ఈ నెంబరుపై సంప్రదించగలరు. 

9849392009. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: