రెండు మోటార్ బైక్ ను ఢీ...

ఒక వ్యక్తి మృతి


(జానో - జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం లోని గడిగరేవుల గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు బైకులు ఢీ కొని చిందుకూరు గ్రామానికి చెందిన దేవదాసు (55 సంవత్సరాలు) మృతి చెందాడు. మృతుడు దేవదాసు నంద్యాల నుండి స్వగ్రామమైన చిందుకూరు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో దేవదాసు తీవ్రగాయాలయ్యాయి మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడు దేవదాసు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు .విషయం తెలిసిన వెంటనే గడివేముల ఎస్ఐ శ్రీధర్ గారు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: