ఆడోళ్ళ జోలికొస్తే చూస్తూ ఊరుకోం

హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ

(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ బ్యూరో)

ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు, చూస్తూ ఊరుకోమని సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే: బాలకృష్ణ హెచ్చరించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...''మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు. నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. అసెంబ్లీలో ఉన్నామో... పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు... హేళన చేయవద్దు. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు. ఏకపక్షంగా సభను నడుపుతున్నారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు.,, అని ఆయన పేర్కొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


    

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: