మార్కాపురం లో *రియల్ ఎస్టేట్" 

వ్యాపారాల లబో...దిబో..

భవిష్యత్ ఆశించి కోట్లలో కొనుగోలు...అమ్మకాలు మాత్రం నిల్

అమ్మకాలు లేక వడ్డీల భారం.

మార్కాపురం  జిల్లా గా మారుతుందని భారీగా కొనుగోళ్లు

అందాని  ద్రాక్షగా మారిన  మార్కాపురం జిల్లా వ్యవహారం

ఆత్మహత్యలే శరణ్యమంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

సొంతింటి కల..ఉద్యోగ..వ్యాపారాల్లో పైసా,పైసా కూడబెట్టుకొని స్తోమతకు తగ్గ ఇల్లు కట్టుకోవాలని ప్రతొక్కరి ఆశ. మార్కాపురం జిల్లా అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారాలు ముమ్మరం చేసి అమాయకులకు అంటగడుతున్నారు. మూడేళ్ళుగా వ్యాపారుల ప్రచారంతో కాసింత స్థలం కానీ,ఇల్లు కానీ కొనుగోలు చేస్తే  పిల్లా పాపాలతో జీవితం హాయిగా ఉంటుందని ఆశపడ్డ మధ్యతరగతి ప్రజలు భంగపాటుకు గురవుతోంది. హైద్రాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబాయి లాంటి పెద్ద, పెద్ద నగరాల్లో లేని ధరలు మార్కాపురం లో కనిపించాయి.

ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి ధరలను అమాంతంగా పెంచేశారు. పలకలు, డిజైన్ పలకలకు మార్కాపురం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచినది. చుట్టూ ప్రక్కన గ్రామాలలో పత్తి, మిరప సాగు విస్తీర్ణం కలిగిన పశ్చిమ ప్రాంతానికి  తలమానికం ఇంజనీరింగ్ విద్యాసంస్థలు ఉండటంతో మార్కాపురం పట్టణంలో అద్దె ఇండ్లకు డిమాండ్ ఎక్కువ.  సమీప  ప్రాంతాల గ్రామాలలో ఎకరా 4 లక్షలు పోయే భూములు  50 లక్షలు నుండి కోటి రూపాయలకు చేరిపోయాయి. భూములు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి టోకెన్ అడ్వాన్సులు  ఇచ్చారు. మరి కొందరు జిల్లా బూచి తో తెలిసినవారివద్ద వడ్డీలకు తెచ్చుకొని ఎకరాల,ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వెంచర్లు వేశారు.

అందమైన బ్రోచర్లు 24 గంటలు వాటర్,విద్యుత్ సౌకర్యం,ఆటవస్తువులు,చక్కటి రోడ్లు,పూల మొక్కలు,ఆహ్లాదకరమైన వాతావరణం అని కొందరు,మరికొందరు హైవే సమీపం,కళాశాలలు,వైద్య శాలలు వస్తాయని కొందరు నమ్మబలికారు.ఇదిగో వస్తుంది,అదిగో వస్తుంది అంటూ ఏళ్ళు గడుస్తున్నాయి. పట్టణంలో ఏకంగా ఎక్కడా లేనివిధంగా గజం 75000 రూపాయలు పై మాటే, శివారు ప్రాంతాల్లో గజం 30 వేల నుంచి 50 వేల రూపాయలు పలుకుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం జిల్లా చేస్తుందని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు సర్వేలు చేయడంతో తొందర్లోనే జిల్లా అవుతుందని ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు. కొందరు వ్యాపారులు అప్పట్లో స్థలాలు కొనుగోలు చేసి చేతులు మార్చడంతో లక్షల ఆదాయాన్ని కళ్ళు చూసారు. ఆశకు అంతం లేకుండాపోయింది.ఇంట్లో ఉన్నవి,బయటనుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఖాళీ స్థలం,పొలాలు కనపడితే ఇష్టా రాజ్జంగా తాహతుకు మించి కొనుగోలు చేసి టోకెన్ అడ్వాన్సులు ఇచ్చారు. పట్టణంలో పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో కొందరు వడ్డీ వ్యాపారుల కోట్లాది రూపాయలు వడ్డీలకు ఇచ్చారు.

భూమి ధరల బొమ్మ తిరగబడింది,రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఒక వైపు,మరో వైపు జిల్లా ఊసు అధికారులు ఎత్తకపోవడం,అమ్మకాలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో దడ మొదలైంది.వడ్డీలు తడిసిమోపెడవుతున్నా స్థలాలు అమ్మకాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. వడ్డీవ్యాపారులు అన్ని గ్రహించి వడ్డీలకు తీసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై వత్తిడులు పెంచారు. స్థాయికి మించి అప్పులు చేసి ,వ్యాపారాలు కనుచూపుమేర లేకపోవడంతో కుటుంబసభ్యులకు చెప్పుకోలేక,వడ్డీలు కట్టలేక ఆత్మహత్య లే శరణ్యం అంటున్నారు. తాజాగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 18 ఎకరాలలో పంచాయతీ లే అవుట్ లేని ప్లాట్లు వేసి  బ్రోకర్లకు కమిషన్ ఆశ చూపి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నాడు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా  అవుతుందని పట్టణంలో ఇలా ఎందరో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కొట్లాదిరూపాయలు వడ్డీలకు తీసుకున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం.డమాల్ కావడంతో వడ్డీవ్యాపారులనుంచి వత్తిడులు అధికామవుతున్నాయి.  పట్టణంలోని వ్యాపారులు కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టిన వరందరిలో కలవరం మొదలైంది. కోట్లు పెట్టి కొన్న స్థలాలు ఒక్కసారిగా పఠనం కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.మరో రెండునెలలు గడిస్తే కొందరికి టోకెన్ అడ్వాన్సు ఇచ్చినవారు పూర్తి డబ్బు కట్టకపోతే టోకెన్ గా ఇచ్చిందికూడా రాకుండాపోతుందని  ఆందోళన చెందుతున్నారు. అప్పులు కట్టలేక కొందరు పెట్టె,బెడా సర్దుకొని ఉడాయించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏదీ ఏమైనా అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,ఇటు వడ్డీవ్యాపారుల్లో అలజడి మొదలైందిి

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: