ప్రజా సేవలో మరో,,,

నూతన కార్యక్రమానికి శ్రీకారం

సెల్ ఫోన్ పోతే ఫిర్యాదు చేయవచ్చు

వినూత్న కార్యక్రమం చేపట్టిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ 


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ఇకపై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల పై పోలీస్ స్టేషన్స్ లో తక్షణమే ఫిర్యాదు  స్వీకరించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ శ్రీకారం చుట్టారు. గతంలో పేద, మధ్యతరగతి మరియు ధనిక కుటుంబాలకు చెందిన ప్రజలు వ్యక్తిగత పనులలో ఉండి మొబైల్ ఫోన్ ను వివిధ ప్రాంతాల్లో మర్చిపోవడం లేదా ఇతర కారణాల వల్ల వారి యొక్క మొబైల్ ఫోను పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు పడేవారని, దాని కారణంగా కొంత మంది ప్రజలు ఫోను పోగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారనే భావనతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించి, పిర్యాదుకు సంబందించిన నూతన ప్రొఫార్మాను తయారు చేసినారు.ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు తెలిసిన అటువంటి ఫిర్యాదులను పోలీసులు తక్షణమే స్వీకరించి చేధించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫారం ఫిల్ చేసి రిసెప్షన్ కౌంటర్ లో ఇవ్వాలి. ప్రతిగా ఆ పిర్యాదుదారునికి పిర్యాదు స్వీకరించినట్లుగా రసీదు ఇవ్వబడుతుంది.    

అనంతరం పోలీసులు ఆ పిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆ వివరాలను  IT core టీంకు పంపడం జరుగుతుంది. IT core లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అప్లికేషన్స్ ద్వార ఎప్పటికప్పుడు మొబైల్ ఫోనును ట్రేస్ చెయ్యడం జరుగుతుంది. దీని ద్వారా భాదితులకు వారి ఫోన్ తిరిగి లభించడం జరుగుతుందని, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని, ప్రకాశం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి ముందుంటుందని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

ప్రజలు వారి యొక్క ఫోన్ లను  పోగొట్టుకున్న యెడల సంబంధిత పోలీస్ స్టేషన్ లలో వాస్తవ పిర్యాదులను ఇవ్వాలని లేదా పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ కు 9121102266 పిర్యాదు చేయాలని తెలియచేసినారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: