తక్షణ సాయంగా .... 

రూ.1000 కోట్లు మంజూరు చేయండి

మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం


(జానో జాగో వెబ్ న్యూస్ _విజయవాడ ప్రతినిధి)

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర నష్టానికి గురైందని ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షా కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ 1000 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం నాడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.

‘‘నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో వివరించారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: