రేపు దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

తిరుపతికి ఈ రాత్రి చేరుకోనున్న కేంద్ర మంత్రి అమిత్ షా... సీఎం వైయస్ జగన్


(జానో జాగో వెబ్ న్యూస్ ఏపీ బ్యూరో)

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారం నాడు తిరుపతిలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరు కానున్న కేంద్ర మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా శనివారం రాత్రి తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేశారు రు. ఆదివారం నాడు ఉదయం 9.20 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 10.25 గంటలకు నెల్లూరు జిల్లాకు చేరుకుని మధ్యాహ్నం 12.55 వరకు అక్కడి స్థానిక కార్యక్రమాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి తిరుపతి ఏర్పోర్ట్ చేరుకొని అక్కడినుండి బయలుదేరి 2.40 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈనెల 15వ తేదీ ఉదయం 7.30 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 8.10 గంటలకు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ చేరుకుని 10 గంటల నుండి 2.30 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఏర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు.

ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.  శనివారం సాయంత్రం 5.45 గంటలకు  గన్నవరం నుండి బయలుదేరి రాత్రి నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం  చేరుకుని, అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి  స్వాగతం  పలికారు. అనంతరం రాత్రి  తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్  చేరుకొని విశ్రాంతి తీసుకొని శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం  తిరుపతి తాజ్ హోటల్ లో బసచేశారు. ఆదివారం నాడు తిరుపతి తాజ్ హోటల్ కి చేరుకొని సాయంత్రం 7.00 గం వరకు దక్షిణ రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: