మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు...

మైనార్టీ సంఘాల ఘన నివాళులు

(జానో జాగో వెబ్ న్యూస్_ నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో  మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా  కాంగ్రెస్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి ఎస్ మస్తాన్ ఖాన్, జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి   సయ్యద్ మహబూబ్ బాషా, జేఏసి కన్వీనర్ సమద్, ఎస్సీ బీసీ జిల్లా సహాయ కార్యదర్శి రియాజ్ మాట్లాడుతూ  మన దేశంలో విద్య అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాదే. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నవంబర్ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

1888 నవంబర్ లో జన్మించిన మౌలానా 1947 ఆగస్టు 15 నుండి అంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1958 ఫిబ్రవరి 2 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. 1920లో ఆయన ఖిలాఫత్ ఉద్యమంలో భాగమయ్యారు.

అప్పుడే మన జాతిపిత మహాత్మగాంధీతో కలిసే అవకాశం వచ్చింది. ఆయన సారథ్యంలోని సహకారేతర ఉద్యమంలో సైతం పాల్గొన్నాడు. కొన్నేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించారు.ఈ స్వాతంత్య్ర సమరయోధుడు మరియు మన దేశంలో విద్యను ప్రోత్సహిండానికి ఎంతో సేవ చేసిన అబుల్ కలామ్ ఆజాద్ కు నివాళులు అర్పించారు.






,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: