రైతు ఉద్యమం--ఓ అపూర్వ విజయం

ఇది దేశ ప్రజల విజయం

సీనియర్ జర్నలిస్ట్ షఫీ అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

దేశంలో సుధీర్ఘకాలం పాటు సాగిన రైతు ఉద్యమం ఓ అపూర్వ విజయం సాధించిందని సీనియర్ జర్నలిస్ట్ షఫీ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికి దేశ ప్రజలు సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల ఉద్యమం సాగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా ఒంగోలులో సాగిన రైతు ఉద్యమ సభలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ షఫీ అహ్మద్ నాటి సభ అనుభవాలను, రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దిగొచ్చిన నేపథ్యంలో ఉద్యమ పోరాట  స్పూర్తిని తన మాటల్లో పంచుకొన్నారు. రైతు ఉద్యమాలతో ప్రధాని నరేంద్రమోడీ దిగొచ్చి వాటిని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది నిజంగా ఈ దశాబ్ద మహోద్యమం అని ఈ దేశ ప్రజల విజయమని ఆయన పేర్కొన్నారు. ఆయన తన అనుభవాలను, ఉద్యమ విజయంపై ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 21 న విజయవాడ, ఒంగోలు లో రైతు ఉద్యమ సభ జరిగింది. మహోద్యమ సారథి రాకేష్ తికాయత్ ముఖ్య అతిథిగా పాల్గొ న్న ప్రసంగానికి రెండు చోట్లా నేనే అనువాద కుడిని. తెలుగు అనువాదం  అందరిని ఆకట్టు కోవడంతో రాకేష్ తికాయత్ సహా అనేక మంది రైతు నేతలు  ప్రత్యేకంగా అభినందిం చినప్పటికీ, వర్తమాన ప్రపంచం చరిత్రను ప్రభా వితం చేసిన ఓ మహో ద్యమ సారథికి నా వంతు తోడ్పాటు. ఈ రోజు నిజమైన ఆనం దాన్ని ఇచ్చింది. ఉత్తరాది రైతు నేతలతో పాటు ఏపీ రైతు నేతలు కొంత మంది, ఆ నాటి అను భూతిని తాజాగా మరో మారు  పంచుకునేందు కు స్వయంగా ఫోన్ చేయడం కూడా మరింత  ఆనందాన్ని ఇచ్చింది. ఏప్రిల్ 21 నాటి తికా యత్ సభనాటి స్మృతులు .. ఆత్మీయుల దృష్టికి మరో మారు.’’ అని సీనియర్ జర్నలిస్ట్ షఫీ అహ్మద్ తన అనుభవాలను పంచుకొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: