ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల అలసత్వం కారణంగానే

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆత్మహత్యాయత్నం..

ఇమ్మడి కాశీనాధ్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల అలసత్వం కారణంగానే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆత్మహత్యాయత్నం జరిగిందని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్ట్ డ్యాం నిర్మాణంలో భాగంగా అర్దవీడు మండలం కాకర్ల గ్రామం వద్ద నిర్మించిన గ్యాప్ పరిధిలో ముంపు కింద నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి లబ్ధిదారుల జాబితాలో తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా అన్యాయం చేసారంటూ కాకర్ల కి చెందిన రామినేనిమాధవరావు, కృష్ణకుమారి దంపతులు


కంభం లోని ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు వద్ద ఆత్మహత్యాయత్నం కి పాల్పడ్డారు. వారిని హుటాహుటిన మార్కాపురం ఏరియా ఆసుపత్రిలో చేర్చాగా అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించగా పరిస్థితి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం రామినేని కృష్ణ కుమారి మృతిచెందారు . రామీనేని మాధవ రావు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఇమ్మడి కాశీనాధ్ దీన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హత్య గా పరిగణించాలన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఇలాగే నిర్వాసితుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే మున్ముందు నిర్వాసితులు ఆత్మహత్యల బాట పట్టే అవకాశం ఉంది.

 


దీని పైన ప్రభుత్వము తక్షణం స్పందించి వెంటనే నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోతే వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఆలసత్వం చూపిస్తుంది , ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యే గా పరిగణిస్తున్నం. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో  కుటుంబంలో ఒకరికి మాత్రమే పరిహారం అందజేస్తామని ప్రభుత్వం నిర్వాసితుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఏళ్ల తరబడి సమయం వృధా చేస్తూ నిర్వాసితులు మార్కాపురం మరియు కంభం ఏస్ డి సి  కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించి న్యాయం చేయకపోతే నిర్వాసితులకు బాసటగా జనసేన పార్టీ తరపున భారీ ఉద్యమం చేపడతాం. విషయాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు తక్షణమే స్పందించి బాధితులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తక్షణమే బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అని ఆయన పేర్కొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

 రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: