అధికార పార్టీ అరాచకం
టిడిపి గెలిచిన స్థానాల్లో ఫలితాలు తారుమారు
అధికారులకు ఇబ్బందులు తప్పవు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
రాష్ట్రంలో జరుగుతున్న జడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ లో కూడా వైసిపి ప్రభుత్వ అరాచకాలకు హద్దుపద్దూ లేకుండా పోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హీర మండలం జడ్పిటిసి స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ పై 59 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారని పేర్కొన్నారు. టిడిపి అభ్యర్థి గెలిచినట్లు అధికారిక ప్రకటన చేసిన తర్వాత వైసిపి నాయకుల వత్తిడితో రీకౌంటింగ్ కు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్దమన్నారు. దీనిని పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియలో అధికారులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. అధికారులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తే న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడకతప్పదని హెచ్చరిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా జూటూరు ఎంపిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి నాగేశ్వరరెడ్డి కౌంటింగ్ లో తొలుత 4ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారని, వైసిపి అభ్యర్థులు రీకౌంటింగ్ చేయించినప్పటికీ 4ఓట్ల మెజారిటీ ఉందని పేర్కొన్నారు. అయినా నిబంధనలను పక్కనబెట్టి మూడోసారి కౌంటింగ్ నిర్వహించి ఒక ఓటుతో వైసిపి అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారన్నారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా అని ఆయన ప్రశ్నించారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ రెండుచోట్ల ప్రజాస్యామ్యబద్ధంగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అధికారికంగా విజేతలుగా ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విజ్జప్తి చేస్తున్నాం అని ఆయన అన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: