ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని

నవంబరు 9న గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు

- పోస్టర్‌ ఆవిష్కరణలో నేతల పిలుపు


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

వానాకాలం, యాసంగితో సహా మొత్తం ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని నవంబర్‌ 9నరాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల కేంద్రాలలో జరిగే నిరసనలో రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్‌లు పిలుపునిచ్చారు. సోమవారం జవహర్‌నగర్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్లును విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ చట్టాల అమలులో భగంగానే యాసంగిలో వరి కొనుగోలు చేయమని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు కాబట్టి యాసంగిలో వరి పంట వేయొద్దని ప్రకటిస్తున్నది. ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరగానీ, బోనస్‌గానీ, కొనుగోలుకు గ్యారెంటీ గానీ ప్రకటించడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం చేతికొచ్చింది. వరి కోతలకు కొన్ని చోట్ల టోకెన్‌ విధానాన్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రోజంతా టోకెన్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ టోకెన్లతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తక్షణం టోకెన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి, కొనుగోళ్ళను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తెరిచినచోట కొనుగోలు జరగడం లేదు.

ప్రభుత్వ మార్గదర్శకాలలో ధాన్యం తేమ శాతాన్ని 17 శాతంగా నిర్ణయించారు. కానీ, అంతకు తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడ మిల్లర్లు కొనుగోలుకు అంగీకరించడం లేదు. కొన్ని చోట్ల తేమ శాతాన్ని చూపి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. పైగా క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు తరుగు కింద తగ్గిస్తామంటున్నారు. గత సంవత్సరం మిల్లర్లు, కొనుగోలు కేంద్రాలు ఇదే విధంగా రైతులను మోసగించాయి. తక్షణం ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని కోరుతూ నవంబర్‌ 9న గ్రామ, మండల కేంద్రాలలో జరిగే నిరసన కార్యక్రమాలలో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాదరావు, వర్ణ వెంకట్‌రెడ్డి, కున్సోత్‌ ధర్మా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మాదినేని రమేష్‌, శెట్టి వెంకన్న, నక్కల యాదవరెడ్డి, గొల్లపల్లి జయరాజు, మద్దిరాజు శ్రీనివాసులు, మూడ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: