వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని,,,,

నవంబర్‌ 9న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

తెలంగాణ రైతు సంఘం డిమాండ్


(జానో - జాగో వెబ్ న్యూస్_హైదరాబాద్ బ్యూరో)

ఈ ఏడాది2021 వానాకాలం మరియు రానున్న యాసంగితో సహా మొత్తం ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని నవంబర్‌ 9న గ్రామ స్థాయిలో నవంబర్‌ 12న జిల్లా కలెక్టరేట్ల ముందు రైతు సంఘం, ప్రజాతంత్ర సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం మార్కెట్‌కు వస్తున్నది. తేమ శాతాన్ని చూపి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా అనేక జిల్లాల్లో తెరువలేదు. తెరిచినచోట కొనుగోలు జరగడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలలో ధాన్యం తేమ శాతాన్ని 17 శాతంగా నిర్ణయించారు. కానీ, అంతకు తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడా మిల్లర్లు కొనుగోలుకు అంగీకరించడం లేదు. పైగా క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు తరుగు కింద తగ్గిస్తామంటున్నారు. గత సంవత్సరం మిల్లర్లు మరియు కొనుగోలు కేంద్రాలు ఇదే విధంగా రైతులను మోసగించాయి. ప్రస్తుతం తేమ 10 శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి నాణ్యత ప్రమాణాలను నిర్ణయిస్తూ జి.ఓ విడుదల చేసింది. ఆ జి.ఓ ప్రకారం 1 శాతం మట్టి, 1 శాతం తాలు, 5 శాతం ఇతర ధాన్యాపు కల్తీ, 3 శాతం పాలు తక్కువ పట్టిన గింజలు, 17 శాతం తేమ వరకు అంగీకరించాలి. ఈ జి.ఓ ప్రకారం శాస్త్రీయంగా ధాన్యాన్ని పరిశీలించడానికి టెక్నికల్‌ అధికారులు ఉండడం లేదు. ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని కోరుతూ నవంబర్‌ 9న గ్రామ, మండల స్థాయిలో, నవంబర్‌ 12 జిల్లా కలెక్టరేట్ల ముందు రైతు సంఘం, ప్రజాతంత్ర సంఘాల తో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ జిల్లా, మండల కమిటీలను కోరుతున్నది. అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: