పర్యావరణ పరిరక్షణకు లోబడి,,,
దీపావళి జరుపుకోండి
రాత్రి 8 గం" ల నుండి 10 గం"ల వరకే బాణాసంచా పెల్చుటకు అనుమతి
ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్
(జానో జాగో వెబ్ న్యూస్ _మార్కాపురం ప్రతినిధి)
పర్యావరణానికి లోబడి దీపావళి సంబరాలు జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ సూచించారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పెల్చుటకు అనుమతి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు , పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూ... కరోనా విపత్తు మరియు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జాతీయ హరిత ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దీపావళి పండగ రోజు అనగా 04.11.2021 న రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని అన్నారు. కేవలం కాలుష్యరహిత టపాసులు, గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మకాలు జరపాలని అమ్మకాలు జరిపే షాపుకి షాపుకి మధ్య తగిన దూరం పాటించాలని, షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు భౌతిక దూరం పాటించాలని, షాపుల వద్ద ఇసుక, నీరు మరియు మొదలైన వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని, దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద మరియు టపాసులు కాల్చే సమయంలో కూడా శానిటైజర్ వాడొద్దని, దాని స్థానంలో సాధారణ సబ్బును ఉపయోగించాలని తెలియచేసినారు. టపాసుల విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లైసెన్సులు కలిగిన వారు మాత్రమే టపాసులు విక్రయించాలని, లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు తయారుచేసిన, నిల్వ చేసినా అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. పండుగ రోజున గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వినియోగించాలని దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ ఆనందగా పండుగ జరుపు కోవాలన్నారు. కోవిడ్వలన
ప్రపంచంలోనూ,మనదేశంలోనూ,రాష్ట్రంలోనూ అనేక కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు తమ కుటుంబసభ్యులను కూడా కోల్పోయారని, కావున ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా పండగను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101, పోలీస్ డయల్ 100 కాల్ చేయండి మరియు పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 లకు మెసేజ్ చేయండి. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపై ఆదేశాలను ఖచ్చితంగా పాటించటానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
Post A Comment:
0 comments: