కన్వీనర్‌ కోటాలో 76 శాతం సీట్లు భర్తీ

పోలా భాస్కర్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో 76శాతం సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 37 కళాశాలల్లో వందశాతం సీట్లు నిండాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, బెస్ట్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటాలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. సెంచురియన్‌లో 268 సీట్లకుగాను 75 సీట్లు మిగిలాయి. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 89శాతం, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 74.94శాతం సీట్లు నిండాయి. మొత్తం 254 కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 1,06,236 సీట్లు ఉండగా, 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. 229 ప్రైవేటు విద్యాసంస్థల్లో 99,872 సీట్లు ఉండగా.. 74,852 మందికి కేటాయించారు. 25 ప్రభుత్వ కళాశాలల్లో 6,364 సీట్లు ఉండగా 5,668 నిండాయి. బీఫార్మసీలో 4,386 సీట్లకుగాను కేవలం 352 మాత్రమే భర్తీ అయ్యాయి. ఫార్మాడీలో 682 సీట్లకుగాను 63 మాత్రమే భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 4,034, ఫార్మాడీలో 619 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 22వ తేదీలోపు కళాశాలలో చేరాలి. 22వ తేదీనుంచి కళాశాలలు ప్రారంభమవుతాయి. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున క్రీడల కోటాలో 488, ఎన్‌సీసీలో 976 మందికి సీట్లను కేటాయించలేదు.

సీట్ల కేటాయింపు లేఖలతో అయోమయం

ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపులో కొంతమంది తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. మొదట వెబ్‌సైట్‌లో ఉంచిన కేటాయింపు లేఖల్లో ఈఏపీసెట్‌కు బదులు ఎంసెట్‌-2020 అని ఉండడంతో కొంత గందరగోళం ఏర్పడింది. గతేడాది వరకు ఎంసెట్‌ పేరుగా ఉండగా ఈ ఏడాది నుంచి దీన్ని ఈఏపీసెట్‌గా మార్పు చేశారు. కేటాయింపు లేఖలో మార్పులు చేయకుండానే వెబ్‌సైట్‌లో పెట్టారు. 200మంది వరకు ఈ లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో వెబ్‌సైట్‌ను కొంత సమయం నిలిపివేసి, కేటాయింపు లేఖల్లో మార్పులు చేసి, మళ్లీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: