జీవో నెంబర్. 49 ను రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిమాండ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్. 49 ను రద్దు చేయాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారంనాడు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో గల ఎస్ వి కె పి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఏఐటీయూసీ,  మార్కాపురం పట్టణంలో గల ఎస్ వి కే పి డిగ్రీ కాలేజీ నుండి పట్టణంలోని పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి మార్కాపురం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

 



ఈ సందర్బంగా ఈ ర్యాలీలో పాల్గొన్న మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ "" లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జీవో నెంబర్. 49 రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థులు" ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడండి-- విద్యార్థుల భవిష్యత్తును రక్షించండి"" అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందె నాసరయ్య , సిపిఎం సోమయ్య, మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వక్కలగడ్డ  మల్లికార్జున,

తెలుగుదేశం మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మార్కాపురం  మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప్ప రెడ్డి, మార్కాపూర్ పట్టణ కౌన్సిలర్ నాలి కొండయ్య, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫార్, మర్రి కొండలు, విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ పాల్గొన్నారు.

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: