సమ్మె తప్పదా...?
28లోగా పీఆర్‌సీ ఇవ్వకపోతే సమ్మె నోటీసు
ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రకటన
జగన్ ఇచ్చిన హామీలూ అమలు కాలేదని ధ్వజం
పట్టించుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరిక
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
పీఆర్సీ పై తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్దపడిన ఉద్యోగ సంఘాలు సమ్మె దిశగా సన్నాహాలుు చేస్తున్నాయి. పీఆర్సీ పై ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఇక సమ్మె చేయకతప్పదని ఉద్యోగ సంఘాలు మానసికంగా సిద్దమైనట్లు సమాచారం. వేతన సవరణ విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు తాజాగా పీఆర్సీ నివేదికను తమకు కూడా అందజేయాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చాయి. పీఆర్సీ నివేదికను తమకు అందజేస్తే జరిగే నష్టమేమీ లేదని పేర్కొంటున్నాయి. అదే సందర్భంలో వేతన సవరణపై ప్రభుత్వానికి ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి డెడ్‌లైన్ విధించాయి. ఈ నెల 28లోగా పీఆర్‌సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రకటించాయి. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ తాము పీఆర్‌సీ నివేదిక మాత్రమే అడిగామని, నెలాఖరులోగా వేతన సవరణ కూడా ప్రకటించాలని వెల్లడించాయి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. రెండున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కాలేదని ధ్వజమెత్తాయి. జగన్ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా అమలవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తామని ప్రకటించి ఏడు విడతల బకాయిలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డాయి. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఉద్యోగుల సమస్యలపై మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాటకే విలువ లేదు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల్ని పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.
అధికారాలే లేని కమిటీ ఎందుకు?
‘దాదాపు నాలుగేళ్లవుతున్నా 11వ పీఆర్‌సీ ఇంకెప్పుడు ప్రకటిస్తారు? వేతన సవరణ నివేదికపై అధ్యయనానికి అధికారుల నేతృత్వంలో నియమించిన కమిటీ గత ఏడు నెలలుగా ఏం చేసింది? పీఆర్‌సీ సిఫారసులను మార్చే అధికారం కమిటీకి ఉందా? ఒక్క అధికారం లేని కమిటీ ఎందుకు? ఇదంతా కాలయాపన కోసమే. అధికారుల అధ్యయనంపై నమ్మకం లేదు’ అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ‘పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పిన అధికారులు.. ఎందుకు దాచిపెడుతున్నారు? 2018 మేలో నియమించిన కమిటీ ఏడాదిలోపే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా ఆలస్యం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశాక.. వారికి వేతన సవరణ అంటూ మరో ఏడాది ఆలస్యం చేశారు. కమిషనర్ నివేదిక ఇవ్వడానికే దాదాపు రెండేళ్లు పట్టింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా 11వ పీఆర్‌సీ కమిషనర్ రాష్ట్రమంతా తిరిగి అనేక సిఫారసులు చేశారు. అందులో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఏం సిఫారసు చేశారో చెప్పకుండా మేం అధికారులతో ఎలా చర్చలు జరపాలి? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారుల హామీ ప్రకారం ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: