హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్న 

భారతదేశపు ప్రఖ్యాత ఫుడీ-ట్రావెలర్ జోడి రాకీ, మయూర్


(జానో జాగో వెబ్ న్యూస్_ హైదరాబాద్ బ్యూరో)

భారతదేశం అత్యంత ఇష్టపడే ఫుడ్‌-ట్రావెల్‌ జోడి రాకీ, మయూర్ 2021 సంవత్సరానికి ముగింపు పలుకుతూ తమ ఆరో విడత HistoryTV18 ప్రత్యేక డిజిటల్‌ ట్రావెల్‌ సిరీస్ #RoadTrippinWithRnM కు శ్రీకారం చుడుతున్నారు. ఐదు విడతల విజయవంతమైన ప్రయాణాల ద్వారా భారతదేశాన్ని సందర్శిస్తున్న ఈ జోడి, ఈసారి హైదరాబాద్‌ నుంచి చెన్నైకి తమ ప్రయాణాన్ని చేపడుతున్నారు. గడిచిన ఐదు సీజన్లలో 13 రాష్ట్రాల్లో 8400+ కి.మీ ప్రయాణానికి 14.7 కోట్ల వీడియో వ్యూస్, 55 కోట్ల ఇంప్రెషన్స్, 59 లక్షల ఎంగేజ్‌మెంట్స్‌ లభించాయి.

ఈ దఫా ప్రయాణ జాబితాలో, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. నవంబర్ 20న వారు తమ ప్రయాణానికి హైదరాబాద్లో శ్రీకారం చుట్టి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చూస్తూ డిసెంబర్ 3న, దక్షిణాది ప్రవేశ ద్వారం చెన్నై చేరుకుంటారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ విభిన్నమైన వైరుధ్యాల సమాహారం. నిజాంల నగరంగా చరిత్రలో ఒదిగిపోయి ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఐటీ హబ్గా నిలుస్తూ భవిష్యత్తుకు బలమైన ఆలంబనగా నిలుస్తోంది. క్రీ.శ.1591లో ఏర్పడిన ఈ నగరం చార్మినార్ చుట్టూ విస్తరించింది. హైదరాబాద్ నగరపు ప్రాధాన్యతను గుర్తించిన ఈ జంట, రెండు రోజులపాటు ఇక్కడి ప్రదేశాలు సందర్శించడమే కాదు, ఇక్కడి రుచులనూ ఆస్వాదించనుంది. 

ఆంధ్రా బ్యాక్డ్రాప్లో సంప్రదాయ ఆంధ్రా భోజనాన్ని వడ్డించే మన పల్లె రుచులును వారు సందర్శించనున్నారు. అంతే కాదు రాకీ, మయూర్ తమ యాత్రలో భాగంగా కోహినూర్ వజ్రం సహ ఎన్నో అరుదైన రత్నాలకు జన్మస్థలమైన గోల్కొండ కోటను సందర్శిస్తారు. చార్మినార్, దాని చుట్టుపక్కల ఉండే ఆహార కేంద్రాలు- నిమ్రా బేకరీ, షా గౌస్ హోటల్ సందర్శించకపోతే హైదరాబాద్ పర్యటన పూర్తి కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ హలీంకు పెట్టింది పేరు షా గౌస్ హోటల్. హలీంకు ఎంత పేరుందంటే దానికి జీఐ సర్టిఫికేషన్ కూడా వచ్చింది. పురాతన కట్టడం పురానీ హావేలిని కూడా ఈ ద్వయం  సందర్శిస్తుంది.  ప్రత్యేకమైన యూరోపియన్ నిర్మాణశైలితో నిర్మించిన ఈ కట్టడంలో ప్రపంచంలోనే అతి పెద్ద వార్డ్రోబ్ – పూర్తిగా చేత్తో తయారు చేసిన ఎలివేటర్  కూడా ఉంది.

నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 3 వరకు సాగే సీజన్‌ 6 #RoadTrippinWithRnM లో రాకీ, మయూర్‌ చేసే సాహసాలను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఫాలో అవండి.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: