నవంబర్ 19వ తేది నుండి 28 వరకు
రండి ఐవైయం లో చేరుదాం...! కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల నవంబర్ 19వ తేది నుండి 28 వ తేది వరకు రండి ఐవైయం లో చేరుదాం...! సమాజంలో నైతికత ను తీసుకువద్దాం... అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త పరిచయ ఉద్యమాన్ని చేపట్టినట్టు జమాత్ ఏ ఇస్లామీ హింద్ మార్కాపురం పట్టణ అధ్యక్షులు మాలిక్ బాషాఅన్నారు.అందులో భాగంగానే స్థానిక చిన్న మసీదు ప్రాంగణంలో లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం యువత సామాజిక చెడులకు బానిసలుగా మారిపోతున్నారని మద్యపానం, పోర్నగ్రాఫీ, జూదం, మత్తుమందు వంటి చెడులకు గురై తమ విలువైన యవ్వనాన్ని యువత నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత మన దేశ వెన్నుముక అని., అలాంటి యువతను చెడు వ్యసనాల నుండి రక్షించి వారిలో నైతికతను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఐవైయం కృషి చేస్తుందని అన్నారు. ఐవైఎం జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (IYM) యువకుల్లో ధార్మిక చైత్యనం కలిగించడంతో పాటు వారిని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ వారిని నైతిక విలువలకు ప్రతీకలుగా తీర్చిదిద్దుతుందని, ఐ.వై.యం తన పని విధానంలో యువకుల నైపుణ్యాలను అభివృద్ది పరచి వారి ద్వారా సమాజంలోని చెడులను నిర్మూలించి మంచిని స్దాపించడం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రంలో పట్టణ ఐవైఎం అధ్యక్షులు తలహా, రాష్ట్ర సలహా మండలి సభ్యులు అయూబ్ ఖాన్ అధ్యక్షులు,ఐవైఎం సభ్యులు ముజఫ్ఫర్, గౌస్ బాషా, అజీమ్, నజమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: