ఏపీని వెంటాడుతున్న వర్షాలు

15న వాయు‘గండం’

18న ఏపీ తీరానికి చేరే అవకాశం

ముసురు వాతావరణం, విస్తారంగా వానలు


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

వరుసగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయు‘గండం’ పొంచి ఉంది. థాయ్‌లాండ్‌, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి నవంబరు 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 18 నాటికి రాష్ట్ర తీరానికి చేరే అవకాశం ఉందని, ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టత రావాల్సి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ‘ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బంగా వరకు ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: