నేటి నుంచి శాసనసభ సమావేశాలు

ఒక రోజుకే పరిమితమా...?

సభలో14 బిల్లులకు ఆమోదం

‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరోసారి సభ

మండలి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక 

నేటి కేబినెట్‌ సమావేశం వాయిదా(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం జరగనున్నది. ఒక రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఇదిలావుంటే కీలకమైన బిల్లుల ఆమోదం కోసం ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నది. ప్రతి ఆరు మాసాలకొకసారి అసెంబ్లీ నిర్వహించాలనే సాంకేతిక అంశానికి లోబడి.. శాసనసభ గురువారం సమావేశం కానుంది. అయితే.. ఈసారి కూడా ఒక్కరోజుకే సభా వ్యవహారాలను పరిమితం చేయనున్నారని తెలిసింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన విష యం గమనార్హం. ఇక, తాజాగా నిర్వహించనున్న సభకు సంబంధించి సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై చర్చించాల్సి అంశాలను ఆమోదించనుంది. ఈ సమావేశానికి సీఎం జగన్‌, మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పాల్గొనే అవకాశముంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలో.. సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు.. చర్చించే అంశాలపై తీర్మానం చేయనున్నారు. కాగా, సాంకేతికంగా ఈ నెల 18లోగా శాసనసభను నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమైన బిల్లులు ఆమోదించుకోవాల్సి ఉన్నందున గురువారం ఒకరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక మరోదఫా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఆమోదించేవి ఇవే :

రువారం ఒక్కరోజు నిర్వహించే అసెంబ్లీలో మొత్తం 14 ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో ఆమోదించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ భూచట్ట సవరణ, ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ యాక్టు సవరణ, ఏపీ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ యాక్ట్‌, ఏపీ విద్యా చట్ట సవరణ, ఏపీ చారిటబుల్‌, హిందూ రెలిజియస్‌ ఇన్స్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్టు సవరణ, ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ యాక్ట్‌ సవరణ, ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ యాక్ట్‌, ఏపీ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ యాక్ట్‌ సవరణ, ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్ట్‌ సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: