*సీబీఎస్‌ఈ గుర్తింపునకు*

 *1,092 ప్రభుత్వ పాఠశాలలు*


(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 *అమరావతి:* రాష్ట్రంలో ఈ ఏడాది 1,092 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈ గుర్తింపునకు వెళ్లనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను సీబీఎస్‌ఈ పరిధిలోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం 15లక్షలకు పైగా జనాభా ఉన్న మహానగరాల్లో పాఠశాలకు 1.5 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో రెండెకరాలు ఉండాలి.


దీంతో ఇలా ఉన్న పాఠశాలలను మొదట సీబీఎస్‌ఈ గుర్తింపునకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1,021, పురపాలకశాఖ నుంచి 71 పాఠశాలలు ఉన్నాయి. సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపునకు చెల్లించాల్సిన రూ.50వేలను

పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి చెల్లించనుంది. పురపాలక శాఖ ఆయా స్థానిక సంస్థల జనరల్‌ఫండ్‌ నుంచి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంలో 20, ఇతర పుర, నగరపాలక సంస్థల్లో 51 ఉన్నత పాఠశాలలను సీబీఎస్‌ఈ గుర్తింపునకు వెళ్లేందుకు ఎంపిక చేశారు. పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: