వెలిగొండపై సీఎం ప్రకటన,,,,

 సంతోషాన్ని కలిగించింది

*వెలిగొండ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు  

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

వెలిగొండ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. వెలిగొండ మొదటి టన్నెల్ నిర్మాణ పనులను వచ్చే ఏడాది పూర్తిచేసి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని సీఎం చెప్పడంపట్ల పశ్చిమ ప్రకాశం జిల్లా రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఏటా వర్షపాతం తక్కువగా నమోదయ్యే ఈ ప్రాంతానికి ఇక వెలిగొండ నీళ్లు రాబోతున్నాయని.. దశాబ్దాల తమ కల నెరవేరబోతుందని ఆనందాన్ని వెలియబుచ్చారు. అంతేకాదు 2023 నాటికి రెండవ టన్నెల్  నిర్మాణాన్ని పూర్తిచేసి 9 వేల క్యూసెక్కుల నీటిని అందిస్తామని జగన్ గారు చెప్పడం కూడా తమకు ఊరట కలిగించిందని.. ప్రస్తుతం ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. సాగుకు నీళ్లు రాక  బీడువారిన తమ నెలలు ఇకపై మాగాణిలా మారతాయని ఏలూరి వెల్లడించారు.  వెలిగొండ ప్రాజెక్టు కోసం వైఎస్ కుటుంబం ఎంతో శ్రమించిందని.. మహానేత వైఎస్ మొదలు పెట్టిన  ఈ మహా యజ్ఞాన్ని ఆయన కుమారుడు పూర్తి చేస్తుండటం చరిత్రలో నిలిచిపోయే అంశమని చెప్పారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు మీద టీడీపీ చేస్తున్న రాదాంతాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని పధ్నాలుగేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు వెలిగొండను ఏనాడు పట్టించుకోకుండా ఇప్పుడు నిర్మాణం పూర్తి దశలో ఉంటే నాటకాలు ఆడటం ఆయనకే చెల్లిందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి గాని ఆ పార్టీ నేతలకు గాని లేదని ఏలూరి అన్నారు..

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: