ఆర్యవైశ్యుల పట్ల సీఎం నిర్ణయం చారిత్రాత్మకం

సీఎం చేసిన మేలు మరువలేనిది

ఎమ్మెల్యే అన్నా రాంబాబు


గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆర్యవైశ్యుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ అంటేనే గుర్తుకువచ్చే ఆర్యవైశ్యులు పూర్వం విశేషమైన సేవలు  చేయుటకు ఆర్యవైశ్య పెద్దలు వారి సొంత ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా విరాళంగా ఇచ్చిన వేలకోట్ల ఆస్తులు, శ్రీ వాసవి మాత ఆలయాలు కాలక్రమంలో దేవాదాయ శాఖలో విలీనం చేయబడినాయన్నారు. నాడు ఆర్యవైశ్య పూజ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య చొరవతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వైశ్యుల మీద ఉండేటటువంటి అపారమైన ప్రేమ, గౌరవంతో శ్రీ వాసవి మాత ఆలయాలను వైశ్యులే సొంతగా నిర్వహించుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. నాటినుండి వాసవి మాత ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెంది విశేషంగా పూజాకార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. దానిని ఆదర్శంగా తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ నాలుగు అడుగులు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులకు దిశానిర్దేశం చేస్తూ ఎంతోమందికి ఉన్నత పదవులను వచ్చేందుకు సహకరిస్తూన్నారన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాస్ చొరవతో ఆర్యవైశ్యుల చిరకాల కోరిక అయినటువంటి ఆర్యవైశ్య సేవా సంస్థలను వైశ్యులే నిర్వహిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు వారికి అవకాశం కల్పించే విధంగా మంత్రి వర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఆర్యవైశ్యుల యొక్క ఆస్తులైన ఆర్యవైశ్య సత్రాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆర్యవైశ్య సంఘాలకు చెందిన ఇతర ఆస్తులు  అన్నింటి పైన పూర్తి అధికారం ఆర్యవైశ్యలకే చెందేటట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక మైనదన్నారు. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సోదరులందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: