కేసీఆర్ తొమ్మిదవసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడైనందుకు

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవాలని

అజ్మీర్ దర్గాలో ముస్లిం దూదేకుల, మన్సూరీల ప్రార్థనలు 


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదవసారి ఏకగ్రీవంగా టీఆరెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనందుకు గానూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలవాలని ఆకాంక్షింస్తూ ప్రముఖ అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు చేయించారు ముస్లిం దూదేకుల, మన్సూరీ సమాజ్ నాయకులు. ఆల్ ఇండియా మన్సూరీ సమాజ్ జాతీయ ఇంచార్జి షేక్ షకీనా, తెలంగాణ రాష్ట్ర ముస్లీం నూర్బాష్, దూదేకుల వృత్తి సంక్షేమ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్, అజ్మీర్ దర్గా కమిటీ నాయకులు -రియాజ్ అహ్మద్, హాజీ హిసాముద్దీన్, తాజ్ జీ మన్సూరి, ఫిరోజ్ భాయ్ కురేషి, ఉస్మాన్ భాయ్ సేఖ్, జావేద్ భాయ్ చిపా, మొహ్సిన్, పఠాన్ మురాద్ చిస్తీ, రాష్ట్ర గౌరవాధ్యక్షులు- షేక్ జానీబాయ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్- ఎండీ. సుభాన్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు - మునీరుద్దీన్, మోయినుద్దీన్, అజారుద్దీన్, ఇస్మాయిల్, ఖాసిం ఫీరా, మీరా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాజ్ మన్సూరీ, రాష్ట్ర కోశాధికారి - పి.నాగూరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: