రాష్ట్ర బంద్ నేపథ్యంలో...

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి... హౌస్ అరెస్ట్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం నాయకుల ఇళ్ల పై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగాద బుధవారంనాడు ఉదయం మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం బస్ డిపో వద్ద తెలుగుదేశం కార్యకర్తలతో కలసి ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా మార్కాపురం పోలీసులు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని అరెస్టు చేసి జవహర్ నగర్ లోని మాజీ శాసన సభ్యుల స్వగృహం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ  కొన్ని వేల కోట్ల గంజాయి రాష్ట్రంలోకి దిగుమతి అయింనదన యువత  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం నాయకులు ప్రశ్నించడం జరిగింది అని ప్రజల దృష్టి మరల్చేందుకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పై మరియు తెలుగుదేశం నాయకుల ఇళ్ల పై వైకాపా గుండాల దాడులకు తెగబడుతున్నారు అని మా అధినాయకుడు ఆదేశిస్తే వైకాపా

గుండాల పని పడతామని హెచ్చరించారు. ఈ  ధర్నాలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: