రాయవరంలో...

 వైద్య సిబ్బంది స్పెషల్ డ్రైవ్ 

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం :మండలంలోని రాయవరం గ్రామంలో గజ్జలకొండ ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యాధికారి దివ్య  పావని ఆధ్వర్యంలో విషజ్వరాలు ప్రబలుతున్నా సందర్భంగా గ్రామంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్లలో  ఎక్కువకాలం నిల్వ ఉన్న నీటితో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందన్నారు. తడి,పొడి,చెత్తను పారిశుధ్య   సిబ్బందికి అందించాలని సూచించారు.దోమల వ్యాప్తి తో డెంగీ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు

.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో  నీటిని ఎక్కువగా నిల్వ ఉండరాదని  ఆమె తెలిపారు.పలు రకాల పరీక్షలు వైద్య పరీక్షలు చేసి,మందులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యమ్మ  పంచాయతీ కార్యదర్శులు సుధాకర్ రెడ్డి,హర్షద రెడ్డి ,హెల్త్ ఆఫీసర్ విమల,  ఏఎన్ఎంలు శంషాద్, విశ్రాంతమ్మ, సునీత, హెప్సి,  వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: