త్రిపురలో ముస్లింల పై దాడుల నివారణలో,,,,
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం
నంద్యాల ముస్లిం జేఎసి
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
త్రిపుర రాష్ట్రంలో వారం రోజులుగా ఏకపక్షంగా ముస్లీంలు పై , మస్జిద్ ల పై జరిగిన దాడులు నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని నంద్యాల ముస్లిం జేఎసి స్పష్టం చేసింది. క్రాంతి రేఖ గ్రంధాలయం లో జేఎసి కన్వీనర్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో కన్వీనర్ ముహమ్మద్ అబులైస్, మస్తాన్ ఖాన్, జావేద్ హుసేన్, ముహమ్మద్ ఫారూఖ్,డి.మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసుల త్రిపురలో సాక్షిగా మస్జీదులు ధ్వంసం అయ్యాయి, మతతత్వ గుండాలు మజీదుల పై కాషాయ జెండాలు ఎగురవేసి పైశాచికత్వం చూపారు, ముస్లిం పురుషులను, స్త్రీలను పిల్లలను తమ ధాష్టికాలతో భయభ్రాంతులకు సృష్టించారు. ఇన్ని దాఢులు జరిగిన, ఆటవిక ప్రదర్శనలు చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు, ఇంతవరకు దుండుగులను అరెస్ట్ చేయక పోవడం శోచనీయమని, ప్రజాస్వామ్యం పరిరక్షించి, లౌకిక విలువలు కాపాడి, దుండుగులను అరెస్టు చేయాలని జేఎసి డిమాండు చేసింది.
మహిళలపై దుర్భాష లాడుతున్న సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోండి....
ఇటీవల నంద్యాలలో, మొన్న ఆదోని లో ముస్లిం మహిళా ఉద్యోగిని పై అహంకారంతో, తెరకెక్కిన మతమౌఢ్యంతో దుర్భాషలడటం ఆక్షేపనీయమని నంద్యాల ముస్లిం జేఎసి తీవ్రంగా నిర్వహించింది. ముస్లిం లను పాకీస్తాన్ వెళ్ళమన్న వెధవ పై చర్య తీసుకోవాలని ఇలాంటివి పునరావృతం అయితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని , ఇది ముస్లిం మనోభావాలను కించపర్చటమే అని జేఎసి స్పష్టం చేసింది.
Post A Comment:
0 comments: