క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి

అదే మనం విద్యార్థులకు ఇచ్చే ఆస్తి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్_ విజయవాడ బ్యూరో)

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే. అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనీ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయడంతో పాటు.. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలని చెప్పారు..అప్పుడు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు.


వైసీపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్‌గా పరంగా వచ్చిన తేడా ఏంటి అన్నది స్పష్టంగా కనిపించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ లాంటి వ్యవస్థలలో సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైన అధ్యయనం జరగాలన్నారు. యూనివర్శిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను సబ్జెక్టుల వారీగా రికార్డ్‌ చేసి.. ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఎం సూచించారు. విద్యార్థులు లెసన్స్ సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలుఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఈ కార్యక్రమములో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి,  కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: