వినూత్న కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం నియోజక వర్గ శాసనసభ్యులు. విద్యావేత్త.. మార్గదర్శకులు..దార్శినికులు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సర్వతోముఖాభివ్రృద్దిని ఆకాంక్షిస్తూ.. వారిలో ప్రేరణ..నిర్ధిష్ట లక్ష్యంఏర్పాటు కొరకు
"IGNITE YOUNG MINDS"
అను వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు...అందు పాఠశాల స్ధాయి..మండల స్ధాయి.. నియోజకవర్గ స్థాయిల్లో వివిధ అంశాలపై పోటీలు నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్న విషయం విధితమే..
అందులో భాగంగా ఈరోజు అనగా స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మాన్యశ్రీ కుందురు నాగార్జున రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ స్థాయి IGNITE YOUNG MINDS-2021 కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిరంతరాయంగా జరుగుతుందని.. ప్రతి విద్యార్థి ఒక నిర్ధిష్ట సామర్థ్యాన్ని కలిగి ఉంటారని దానిని గుర్తించి ప్రతిభను ప్రోత్సహించడం చేయాలని..
ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి
తద్వారాారా లక్షసాధనకు విద్యార్ధికి అవకాశం ఉంటుంది అని.. ప్రతి పాఠశాల నుండి ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడానికి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.. వ్యాసరచన.. డ్రాయింగ్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో జూనియర్ మరియు సీనియర్ విభాగాల్లో విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది... ఈ ఈవెంట్ ను స్పాన్సర్ గా సింగంపల్లి శ్యామలాంబ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు యస్ సిహెచ్ సుబ్రహ్మణ్యం గణిత శాస్త్ర ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులను అభినందించారు...
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివజ్యోతి.. డిప్యూటీ డిఇఓ రోజ్ రాణి.. మార్కాపురం..తర్లుపాడు.. కొనకలమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు.. శ్రీమతి పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి.. సూరెడ్డి భూలక్ష్మీ సుబ్బారెడ్డి.. యం.మురళి.. మున్సిపల్ వైస్ చైర్‌పర్శన్ సి అంజమ్మ..కౌన్సలర్లు జి వనజాక్షి..భాను..మండల విద్యాశాఖాధికారులు..ప్రధానోపాధ్యాయులు..స్ధానిక పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి ..సభ్యులు.. ఉపాధ్యాయులు..విద్యార్థులు పాల్గొన్నారు..
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: