బంద్ కు తరలి రాగా...

గడివేముల టిడిపి నాయకుల గృహనిర్బంధం

టిడిపి కార్యాలయం వద్ద గృహనిర్బంధం లోనికి తీసుకున్న పోలీసులు

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

బంద్ కు తరలివస్తున్న టీడీపీ నేతలను  ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు, గృహనిర్బంధాలు  చేశారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా గడివేముల మండలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గడివేముల మండలం లోని టిడిపి నాయకులు అభిమానులు, భారీ సంఖ్యలో ఆ పార్టీ గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి టి డి పి ఆఫీస్ వద్దకు రాగా వారందరినీ పోలీసులు గృహ నిర్బంధం లోకి తీసుకున్నారు.


 బందు నిర్వహించడానికి వెళ్తున్న టిడిపి నాయకులు అభిమానులు

గృహనిర్బంధం చేసిన సందర్భంగా గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ఆఫీసులపై, నాయకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ భాగస్వాములని, ప్రజల కష్ట నష్టాల గురించి మాట్లాడే వారిపై దాడులు చేయడం సరికాదని, ఇలాంటి దాడులకు టిడిపి నాయకులు కార్యకర్తలు భయపడతారని అనుకోవడం అవివేకం అని,దాడులు చేసిన వారందరినీ శిక్షించాలని అని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల సీనియర్ టిడిపి నాయకులు సీతారామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, బంగారు షాపు శ్రీకాంత్, ఒందుట్ల టిడిపి నాయకులు గంగాధర్ రెడ్డి, గఫూర్, కొర్ర పోలూరు టిడిపి నాయకులు జయన్న, బొల్లవరం టీడీపీ నాయకురాలు సుభద్రమ్మ, టిడిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: