ప్రపంచ మనస్తత్వవేత్త,,,

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం


హజ్రత్ ఆదం అలైహిస్సలాం గారిని అల్లాహ్ భూమిపై దింపినప్పటి నుండే మనిషిలో సంతోషం,విచారాలు నిబిడీకృతమై ఉన్నాయి. మనిషి వ్యాకులతకు, చికాకులకు దూరంగా ఉండడానికి ఉపాయం ఆలోచిస్తూనే వస్తున్నాడు. దీనికి మంచి ఉదాహరణ ఆదం అలైహిస్సలాం తౌబ చేయడం (పశ్చాత్తాప పడటం).  ఆదం హవ్వ  తౌబ చేసినప్పుడు అల్లాహ్,  

లా ఖౌఫుతజ్ నూన్  భయపడకు, కలవర పడకు, విచారపడకు అన్నాడు. ఈ విధంగా మనిషి పుట్టుకతోనే విభిన్న రకాల టెన్షన్ లతో పుట్టాడు. అయినప్పటికీ నైతిక ఆలోచనలు వెంటనే ఉంటాయి. అన్ని మత గ్రంథాలలో మనస్తత్వాన్ని వేరువేరు రీతిలో చెప్పబడింది. అంటే మనిషి తన పుట్టుకను గుర్తించి ఆధ్యాత్మిక స్థానాన్ని, దైవ సామీప్యాన్ని పొందగలగాలి. జీవితం ఒక పరీక్ష అని చెప్పబడింది. ఎందుకంటే అతని మనస్తత్వం, ఆత్మ ప్రకాశమానంగా వెలిగి పోవాలి. అసలైతే మనస్తత్వం గురించి అనాదిగా బోధించడం జరుగుతూనే ఉంది. గ్రీకు, ఈజిప్ట్, భారతదేశం, అరేబియా మేధావులతో పాటు పశ్చిమ దేశాల మేధావులు కూడా ఇందులో భాగస్వాములే. ఈ మేధావులలో ప్రత్యేకించి ఇబ్నె సీనా, ఇబ్నె ఖుల్దూన్,  ఇమామ్ gazali,రాజి మొదలైనవారు ఇందులో ఉన్నారు.వారు ఇస్లాం మూల విషయాలను ఇస్లాం తో ముడిపెట్టి విజయవంతమైన జీవితం యొక్క విజయ రహస్యాన్ని విడమరచి చెప్పారు. ఎందుకంటే మనిషి ఏ ఆపదలో నైనా, ఏ విచారం లోనైనా ధైర్యంతో నిలబడి పరిస్థితులను ఎదుర్కో గల  గాలి. దివ్య ఖుర్ఆన్  మానవువుడిని మాటిమాటికీ ఆలోచించమని తాకీదు ఏదయితే చేసిందో దాని అసలైన ఆశయం ఏమిటంటే మనిషి తన తెలివి తేటలను బాగా ఉపయోగించుకోవాలని. ఏలాంటి చీకు చింతలు విచారాలు  వచ్చినా ఎదుర్కోవాలని. ఈ తత్వజ్ఞానాన్ని ఈనాటి యుగంలోcogniti vetherapy  గా చెప్పబడుతున్నది. అసలైతే సైకాలజీ ఒక ప్రాచీన విద్య. కానీ 15వ శతాబ్దం నుండి దీనికి ఒక కొత్త ప్రయత్నం లభించింది. ప్రాచీన కాలంలో తత్వజ్ఞానానికి,  అనుమానానికి దీనికి మంచి పట్టు ఉండేది. మంత్ర తంత్రాల వైద్యంపై ప్రజలకు నమ్మకం ఉండేది.


ప్రజలు అనవసరమైన సంప్రదాయాలకు, అపనమ్మకాలకు గురై ఉండేవారు. 19వ శతాబ్దం వరకు ఇబ్నే సీనా రాసిన ప్రముఖ గ్రంథం వైద్య నియమాలు. ఈ గ్రంథం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వైద్య శాస్త్ర కోర్సులలో బోధింపబడేది,ఈనాటికీ ఇది వైద్యశాస్త్రంలో ఎన్సైక్లోపీడియా గా చలాణిలో ఉంది.

RENE DES CAR TES మనిషిలోని రెండు విషయాలను అంటే ఆలోచనలను, శరీరాలను విశ్లేషించడం జరిగింది. అతను మనిషి ఆలోచనలను ఇప్పుడు ప్రుతి వ్యాధి భూతములు గా ఉదాహరించాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు కనుక అతను మనిషి ,అంటే ఆలోచించడంలోనే చింతన చేయడంలోనే మనిషిని జీవరాసులన్నింటికంటే ఉన్న తునిగా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్ని పరిశోధనలయితే జరిగాయో  వాటిని సూక్ష్మంగా అధ్యయనం చేస్తే అది ఇస్లామీయ బోధనల కు అనుగుణంగా కనిపిస్తాఇ. 1400 సంవత్సరాలకు పూర్వం రబ్బిల్ అవ్వల్ నెలలో జన్మించిన ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలలో ఉన్నాయి. ఆయన సల్లం గారి బోధనలలో ప్రతి విషయం ఉంది.

ఇది ఆచరణ ద్వారా లభించే ఒక పాఠం. దైవప్రవక్త జీవిత చరిత్రను అధ్యయనం చేసినట్లైతే అడుగడుగున ఎన్నో లాభాలు  కలుగుతాయి. అల్లాహ్ సకల లోకాలకు కారుణ్యం గల ప్రవక్తను మనకోసం పంపాడు. ఆయన తన శుభకరమైన జీవితంలో మేలు తరమైన పనుల గురించి మాత్రమే సందేశం ఇచ్చారు.ఇహపర లోకాలలో విజయం సాధించే ఉన్నతమైన వివేకాలతో సత్కరించారు. దైవ ధర్మం గురించిన ఏ సందేశం అయితే ఇచ్చారో అది మేళ్ళతో నిండినది. కోపం నుండి, నేను అనే అహం నుండి, గర్వం ప్రదర్శించడం నుండి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు మనం జీవించడానికి దైవప్రవక్త ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించి ఇచ్చారు. ఈ వ్యవస్థలో  ఎప్పుడు కూడా కోరికలు, భయాల నీడలు  కూడా కానరావు

ఒక వ్యక్తి ఆయన సల్లం వద్దకు వచ్చి ప్రవక్త నాకు కోపం ఎక్కువ  అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లం అన్నారు: కోపం చెయ్యకు కోపం చెయ్య కు కోపం గురించి ఇప్పటి వరకు మానసికంగా వైద్యపరంగా ఏ పరిశోధనలయితే జరిగాయో  వాటివల్ల తెలిసిందేమిటంటే అది మనిషి ఆరోగ్యం కోసం విషతుల్యమైనది. కోపం ఎలాంటి అగ్ని అంటే మనిషిలోని దృఢ సంకల్పాన్ని, ఆలోచనలను కాల్చి బూడిద చేసేస్తుంది. కావున దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కోపం చేయకు అని ఏదైతే మనకు హితవు చేశారో అందులో మానసికమైన ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి. వాటిని ఈనాడు పరిశోధకులు  కూడా చెబుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని మన ముందుంచుకోవాల్సి ఉంటుంది. ఆయన సల్లం గారి హృదయం విచారంలో మునిగి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ తన ముఖం పై చిరునవ్వు చెదరనిచ్చేవారు కాదు. ఆయన అతి తక్కువగా మాట్లాడేవారు.

ఈనాడు సైన్స్ చెప్పేది కూడా ఇదే. ఇదే విధంగా మాట్లాడడం ముసి ముసి గా నవ్వుతూ ఉండడం లాభదాయకమైనది అని. ఇస్లాం సహజమైనది అది ప్రళయం వరకు ఉంటుందనే విషయాన్ని ఎవరు వ్యతిరేకించలేరు.ఇస్లాం, జీవితంలోని అన్ని రంగాలకు మార్గదర్శకం చేస్తుంది. ఆయన జీవితం లో హితవు చేయని రంగమంటూ ఏదీ లేదు.

మనిషిలోని న్యూనతా అనేది ఒక మానసికమైన వ్యాధి. అది మనిషిని లోలోపల తిని  వేస్తుంటుంది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం చివరి ప్రసంగం, మనిషిలోని న్యూనతా అనే ఆలోచనలను తగ్గించివేస్తుంది. ఎందుకంటే దైవప్రవక్త సల్లం, రంగు వంశం మొదలైనవి మనుషులలో ఒకరిపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వలేవని స్పష్టం చేశారు. ఏదైనా ఔన్నత్యం, ఏదైనా గొప్పదనం ఉందంటే అది దైవ భీతి మాత్రమే అని అన్నారు.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైన జీవితం గడపడానికై దివ్యఖుర్ఆన్ నిజమైన బోధనలు, ప్రవక్త సల్లం గారి జీవితంలో అవి కానవస్తాయి. దివ్య ఖుర్ఆన్ లో, దైవ ప్రవక్త జీవితంలో ఇతరుల కోసం ప్రయోజనకరమైన బోధనలు ఉన్నాయని చెబుతూ లఖద్ కాన  లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన  అంటే దైవ ప్రవక్త సల్లం గారి జీవితంలో నీరసం గొప్ప ఆదర్శం ఉండినది. ఆయన జీవితం ఒక మంచి ఉదాహరణ.

మానవత్వం, నైతికత మహోన్నతల ఉదాహరణలు ఆయన జీవితం లోని ప్రతి పార్శంలోనూ కానవస్తాయి. మక్కా విజయం తర్వాత శత్రువుల పట్ల ఆయన ప్రవర్తన యొక్క గొప్ప ఉదాహరణ ప్రళయం వరకు మరి ఎక్కడ కాన రాదు. శాంతి దూత అయిన ప్రవక్త ఆనాడు శత్రువులను సంబోధించి పోండి ఈరోజు మీతో ఎలాంటి ప్రతీకారం తీర్చుకోబడదు.  మీరందరూ స్వతంత్రులు. దైవ ప్రవక్త సల్లం ఖడ్గం ద్వారా విజయం సాధించడం కాదు ఉన్నత నైతిక ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ఆధిపత్యం నేర్పించారు.

ఆయన సల్లం  గారి జీవిత చరిత్రను అధ్యయనం చేసినట్లయితే మానవులలో సమానత్వం, ప్రేమ, ఐకమత్యం గల ఆచరణకు సాక్ష్యం లభిస్తోంది.

తమ ఆధిపత్యంపై, తమ పెత్తనంపై గర్వపడే అరబ్బు జాతి వారి అమ్మాయిలు బానిసలను వివాహం చేసుకుని సమానత్వాన్ని నిరూపించారు. శారీరక రంగు వల్ల ఎవరు గొప్ప వారు కారు విద్యా జ్ఞానాలు, సేవ, ఉన్నత నైతిక ప్రవర్తన వల్ల గౌరవం లభిస్తుంది. 

మానసిక జ్ఞానం ద్వారా చెప్పాలంటే దైవ ప్రవక్త సల్లం అన్నారు, ఒకవేళ మీరు ఏ వ్యాధిగ్రస్తుడి వద్ద కైనా వెళ్ళినట్లయితే అతనికి ధైర్యం చెప్పండి అలా చెప్పడం వల్ల మానసికంగా ధైర్యం లభిస్తుంది అతనిలో శక్తి పెంపొందుతుంది. ఈ వ్యాసకర్త మరియు అత్యధిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం కూడఇదే. వ్యాధిగ్రస్తుని కి ఆరోగ్యం చేకూరే భరోసా నమ్మకం కలిగించాలిఅనేది ఏలాంటి ప్రవర్తన అంటే అది ఎల్లప్పుడూ విజయవంతమైన ప్రవర్తన అని నమ్ముతారు. ప్రతి వ్యక్తి వ్యాధికి  భయపడుతూ ఉంటాడు. గత కొన్ని రోజులుగా మహమ్మారి కరోనా వల్ల ప్రపంచమంతా వణికిపోయిన దృశ్యాలను మనం చూసి ఉన్నాము. మెల్ల మెల్లగా ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఇక్కడ మనం గనుక దైవ ప్రవక్త సల్లం గారి బోధనలను ఆసరాగా తీసుకుంటే మనం జాగ్రత్తగానూ ధైర్యంగానూ ఉండాలనే విషయం బోధపడుతుంది. ఇవే మనల్ని మోక్షాన్ని ప్రసాదిస్తాయి. దివ్య ఖుర్ఆన్ లోని రెండవ సూరాలో ఇచ్చిన శుభవార్త ఏమిటంటే సహన వంతులకు ఆపద కలిగినప్పుడు వారు ఇలా అంటారు మావద్ద ఏదైతే ఉందో అది అల్లాహ్ ఇచ్చినదే. ఆయన వైపునకే మేమంతా మరలి పోయే వారము. అలాంటి వారిపై అల్లాహ్ తరఫునుండి బహుమతులు ఉన్నాయి. వారి పై కారుణ్యం కురుస్తుంది. వారు అనుగ్రహం పొందిన వారు. దైవ ప్రవక్త బోధనల ద్వారా తెలిసేది ఏమిటంటే ప్రపంచంలో చిట్టచివరి ప్రవక్త మహా గొప్ప మానసిక శాస్త్రవేత్త కంటే ముందు మరొకరు రాలేదు ఆయన తర్వాత ఎవరూ రాలేరు. ఆయన బోధనలలో  ప్రతి వ్యక్తికి నివారణ ఉంది. శరతు ఏమిటంటే విశాలమైన ఆలోచనలతో అర్థం చేసుకోవాలి. చివరిగా నేను ఒక మానసిక విద్యార్థిగా సమ్మతించేది ఏమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహా గొప్ప మానసిక శాస్త్రవేత్త అని. రండి మనం ఇస్లామీయ బోధనలను ఇస్లామీయ  మానసిక నియమాలను అనుసరిద్దాం. ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొందాం, విజయం సాధిద్దాం. ఆమీన్

MERAA KAMLI WAALA 

KAISA NIRAALA HAI 

DO AALAM KA AAQHAA HAI SAB SE NIRAALA 


 రచయిత--డాక్టర్ కుతుబుద్దీన్ మానసిక శాస్త్రవేత్త

 chicago USA


అనువాదం-- ముహమ్మద్ అబ్దుర్రషీద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: