విధుల నిర్వహణలో నిర్లక్ష్యం...ఇక జాగ్రత్త

కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్


కలెక్టర్  ప్రవీణ్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని ప్రజానికానికి సేవలందించాల్సిన పలు ప్రభుత్వ కార్యాలయాలలో కొంతమంది ప్రభుత్వ అధికారులు వారు చేయవలసిన విధుల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ,  సేవలకై వచ్చిన వారి కాలాన్ని, మరియు ధనాన్ని దుర్వినియోగం పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పక్కా ప్రణాళికతో “ రెవెన్యూ స్పందన  “ద్వారా ఒక సమగ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 21,22 తేదిలలో  ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లాలోని అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమములో రెవెన్యూ శాఖలోని భూమి సంబంధిత సమస్యల సేవలు, అనగా మ్యూటేషన్ సేవలు, వెబ్ ల్యాండ్ అడంగల్ నందు పట్టాదారుకు సంబంధించిన మార్పులు/చేర్పులు, ప్రభుత్వ భూమి అసైస్మెంట్, ఇంటి స్ధలం మంజూరు,


 

ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు, భూమి హద్దుల సమస్యలు, చుక్కల భూములు, నిషేధిత భూముల జాబితాలో సవరణలు, అభ్యంతరం కాని ప్రభుత్వ భూములలోని ఆక్రమిత నివాస గృహాల క్రమబద్దీకరణ, సర్వే సమస్యలు మొదలైన అన్ని రకాల భూమి సంబంధిత సమస్యలను, సమీప గ్రామ మరియు వార్డు సచివాలయంలోని గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయరులు దరఖాస్తు చేసకున్న అర్జీలకు రశీదు ఇస్తారని తెలిపారు.


 

     ఈ కార్యక్రమములో వచ్చిన అన్ని అర్జీలను కంప్యూటరీకరణ చేసి, ఒక ప్రత్యేక రిజిష్టరులో నమోదు చేసి కనిష్టము 15 రోజులు నుంచి గరిష్టముగా 30 రోజులలో పరిష్కరించుటకుగాను కలెక్టరు గారు మార్గదర్శకాలు నిర్ధేశించారు. ఈ కార్యక్రమము పర్యవేక్షణకై తహశీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ కలెక్టర్ వారు తమ పరిధిలోని కనీసం 10 గ్రామ/వార్డు సచివాలయములను తనిఖీ చేయుదురు. కావున “ రెవెన్యూ స్పందన “ ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల పరిష్కార కార్యక్రమము ఏర్పాటు జిల్లాలోని రైతులకు, పట్టాదారులకు, అర్జీదారులకు, ఎంతగానో ఉపయోగకరమని కావున జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవలసిందిగా జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేశారు. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: