రైతులకు ముందే దీపావళి.... కాంతులు

*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

*వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*

*వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*

రేపు ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్


(జానో జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)

*రైతన్నల లోగిళ్ళలో దీపావళి కంటి ముందే కొత్త కాంతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నింపనున్నది. ఇందులో భాగంగా ఒకేరోజు మూడు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది చేకూరేలా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యేలా, సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.


*వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,190 కోట్ల లబ్ది...ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,213 కోట్లు నేడే బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం*

*1. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో ఇవ్వనున్న రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం

ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు

చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం

మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 – 4 సంవత్సరాలు – రూ. 50,000

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్నది – ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలు – రూ. 67,500

రైతన్నలకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500

*మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500*

*రెండో విడత – ఖరీఫ్‌ పంట కోత సమయం అక్టోబర్‌ నెల ముగిసేలోపు, రబీ అవసరాల కోసం రూ. 4,000*

*మూడో విడత – ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000*

*2. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*

ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112.7 కోట్ల వడ్డీ రాయితీ. ఈ రోజే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా జమ. చక్రవడ్డీల పద్మవ్యూహంలో చిక్కుకుని అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని అందిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 64.96 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ప్రభుత్వం

3. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,720 రైతు గ్రూపులకు రూ. 25.55 కోట్ల లబ్ది నేడే జమ

సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: