*కార్పొరేట్‌కు దీటుగా స్కూళ్లు*
మనబడి నాడు–నేడు ఎంతో ప్రతిష్టాత్మకం*
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణములోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఇగ్నైట్ యాంగ్ మైండ్స్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు పలువురు వేదికను అలంకరించిన పెద్దలతో బహుమతి ప్రదానోత్సవం సభ నర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మనబడి, నాడు–నేడు కార్యక్రమం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని అన్నారు.
ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి
పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇగ్నైట్ యాంగ్ మైండ్స్ కార్యక్రమం గురించి ఇటువంటి పోటి పరిక్షల ద్వారా విద్యార్ధులలోని మేధాశక్తిని వెళికితీస్తున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘణంగా నిర్వహించడానికి కారణమైన ఉపాధ్యాయ బృందానికి ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి గారు అభినందనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..మనబడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల రూపు మారిందన్నారు. గతంలో కంటే మెరుగ్గా పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లోని టీచర్లంతా క్వాలిఫైడ్, సామర్థ్యం ఉన్నవారని, కార్పొరేట్ స్కూళ్లలో ఉండరని తెలిపారు.
గతంలోంలో ప్రభుత్వ స్కూళ్లు అంటే చిన్న చూపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరే వారి సంఖ్య పెరగడమే కాకుండా ముందుముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టె పరిస్థితి కూడ రావచ్చేమొ అనే అనుమానాన్ని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయేతర సిబ్బంది,పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాశం జిల్లా, మార్కాపురం.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి
https://youtu.be/fGWka5JP6go
టిపు సుల్తాన్ కొందరి వాడు కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు
టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: