మస్జిద్-ఎ-రసూల్ లో,,,
అలరించిన నాతియా ముషాయిరా
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
కర్నూలు జిల్లా నంద్యాలలోని మస్జిద్-ఎ-రసూల్ లో నాతియా ముషాయిరా ఎంతగానో అలరించింది. ఈ నాతియా ముషాయిరా ఉర్దూ ప్రియులను అలరించింది. రాష్ట్ర ఇత్తేహాదుల్ ఉలమాయె హింద్ ఆధ్వర్యంలో జరిగిన ఉర్దూ గేయకారుల నాతియా ముషాయిరాకు నంద్యాల జమాఆతె ఇస్లామి హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ అధ్యక్షత వహించారు, హాఫీజ్ ముహుమ్మద్ సలీం పర్వేజ్ కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమీ మాజి చైర్మెన్ డా.ముహమ్మద్ నౌమాన్,
హైదరాబాదు పీఠాధిపతి సయ్యద్ హుస్సేన్ పీర్, ఇత్తేహాదుల్ ఉలుమా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ షఫీవుల్లా, కోఆప్షన్ కౌన్సిలర్ సయ్యద్ సలాముల్లా, కౌన్సిలర్ తమీమ్, ప్రముఖ జాతీయ స్ధాయి ఉర్దూ గాయకులు, యూపి ప్రతాప్ ఘడ్ కు చెందిన హాఫీజ్ సాబీర్ సిధ్దీఖ్ , హైదరాబాద్ ఖారి మౌలానా అబ్దుల్ రెహమాన్, నెల్లూరుకు చెందిన హాఫీజ్ ఉస్మాన్,మౌలానా తయ్యిబ్, వెలుగోడు నంద్యాల ఉర్దూ కవులు పాల్గొని మధురమైన స్వరంలో ప్రవక్త ముహమ్మద్ (స) గుణగణాలు, జీవిత ఘట్టాలు వివరించారు.అనంతరం కవులకు శాలువా కప్పి మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈసంధర్భంగా అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఈ మూషాయీరాల ద్వారా ఉర్దూ భాషా ప్రోత్సహించే బడటమే కాక సాహిత్య మాధుర్యం ఆస్వాదించ బడుతుందనీ, ప్రతీ సంవత్సరం నిర్వహించ బడుతుంది తెలిపారు.
Post A Comment:
0 comments: