సచివాలయ ఉద్యోగి సుధాకర్ పై చర్యలు తీసుకోవాలి

మహిళను దూషించి ఆమెపైనే కేసులా

మండిపడ్డ ముస్లిం ప్రజాసంఘాలు... కాంగ్రెస్ పార్టీ

సుధాకర్ ను విధుల నుండి తొలగించి మహిళపై నున్న కేసులు ఎత్తివేయాలి

(జానో జాగో వెబ్ న్యూస్_నంద్యాల ప్రతినిధి)

మహిళపై దాడికి పాల్పడ్డ నంద్యాల పట్టణ 26 వ వార్డు సచివాలయ ఉద్యోగి సుధాకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని ముస్లిం ప్రజాసంఘాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.  ఈ నెల ఏడో తేదీ 26 వ వార్డు సచివాలయంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళపై దాడికి పాల్పడ్డ సచివాలయ ఉద్యోగి సుధాకర్ ను వెంటనే అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని జానో జాగో(ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం, ఆవాజ్,  ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాయి. పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జానో జాగో(ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి ఇ సయ్యద్ మహబూబ్ బాషా, ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు బాబుల, ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ జిల్లా కార్యదర్శి సలాం మూలానా, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ 26 వ వార్డు లో షబానా అనే మహిళ పట్లసచివాలయ ఉద్యోగి సుధాకర్ అసభ్యకరంగా మాట్లాడుతూ


ఆమెపైె
పై దాడికి పాల్పడి చెప్పరాని విధంగా బూతులు మాట్లాడి మరల ఆమెపైనే పోలీస్ కేసు నమోదు చేయడం దారుణమని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగుల వల్ల మహిళలకు భద్రత లేకుండా పోతుందని మహిళలకు సచివాలయం రక్షణ లేకపోతే రాబోయే రోజుల్లో మహిళలు సచివాలయం రావాలంటే భయభ్రాంతులకు గురి అవుతారన్నారు. కాబట్టి ఇప్పటికైనా సచివాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మహిళ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని, ఉద్యోగి సుధాకర్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నతాధికారులు కలగజేసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆ మహిళకు న్యాయం చేయాలని లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ సమస్య పరిష్కారం వరకు పోరాడుతామని వారు హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: