బీసీల కులగణన చేపట్టాలి

గడివేముల ఎమ్మార్వోకు ఏపీఎంబీసీ సంక్షేమ సంఘం వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

బీసీల కులగణన చేపట్టాలని గడివేముల ఎమ్మార్వోకు ఏపీఎంబీసీ సంక్షేమ సంఘం వినతి పత్రం అందజేసింది. అదే సందర్భంలో గడివేముల ఎమ్మార్వో నాగమణికి జ్యోతిరావు పూలే చిత్రపటంను నేతలు బహుకరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె ప్రసాదు మాట్లాడుతూ గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ బీసీల కుల గణన చేయకపోవడం చాలా బాధాకరమని ఎందుకంటే బీసీలు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా బీసీల కులగణన జరగాల్సిందేనని ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1156 అంటరాని కులాలుగా ఉన్న అన్నిటిని ఎస్సీ అన్న గొడుగు కిందికి, అంబేద్కర్ తీసుకురావడమే కాకుండా వారి యొక్క జనాభా ప్రాతిపదికన 15 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో రాజ్యాంగ పరంగా ఈ రోజు పొందుతున్నారు.

దానితోపాటు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క కుల గుణ చేయడం జరుగుతుంది కానీ బీసీలకు ఇంతవరకు జనాభా లెక్కలు చేయలేదు కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో బీసీల జనాభా లెక్కల తో పాటు ప్రతి కులాల జనాభా లెక్కలను కూడా చేయాలని తీర్మానించడం, సంతోష విషయమైనా దానితోపాటు గత ప్రభుత్వము అమలు చేసిన జీవో నెంబర్ 17 పునరుద్ధరణ చేయాలని అలాగే బిసి కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి బీసీ, ఎంబీసీ, డిఎన్టీ లుగా, విభజన చేసి బీసీల కు సమన్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యలవాడ వెంకటేశులు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు అయ్యన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసాదు, కర్నూలు జిల్లా సెక్రెటరీ కె.గోపాలు, జిల్లా కోశాధికారి వై మద్దిలేటి, గని గ్రామ సెక్రెటరీ జి .వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: