ఏపీ నుంచే గంజాయి

జగన్ అన్ని రోజులు ఒకేలా ఉండవు

నారా చంద్రబాబు నాయుడు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గుజరాత్‌లో హెరాయిన్ డంప్ పట్టుకున్నారని, దీనికి ఏపీకి లింకులున్నాయన్నారు. ఇంతటి పెద్దఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించామన్నారు. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం మొదలుపెట్టిందన్నారు. పోరాటానికి  ప్రజల నుంచి సహకారం వచ్చిందని, కానీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రోజులు ఇలానే ఉండవని, జగన్ తస్మాత్‌ జాగ్రత్త అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటివరకు తాను మూడుసార్లు నిరాహార దీక్ష చేశానన్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద దాడి చేసిందన్నారు. డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: