మీర్జా పేట సచివాలయాన్ని సందర్శించిన,,,
జిల్లా పంచాయతీ అధికారి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మీర్జా పేట సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి సందర్శించారు. అక్కడి సర్పంచ్, సభ్యులతో, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఆదర్శ గ్రామాలుగా మారాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పెరిగే వరకు వాటిని కాపాడాలని సూచించారు. వారే స్వయంగా ఒక మొక్కను నాటారు.
ముఖ్యంగా జగనన్న స్వేచ్ఛ సంకల్పంతో భాగంగా ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి హరిత రాయబారులు చెత్త సేకరణ జగనన్న స్వచ్ఛ సంకల్పం ఆప్ లో నమోదు చేయుట గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సూరెడ్డి .రామసుబ్బారెడ్డి, దేవి రెడ్డి భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, ఎక్కంటి రామిరెడ్డి, దేవి రెడ్డి లింగారెడ్డి, శేషయ్య, మరియు మురారి వెంకటేశ్వర్లు, వెన్న సత్యనారాయణ రెడ్డి, తర్లుపాడు మండల పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: