లబ్ధిదారులకు...

రెండో విడత ఆసరా చెక్కుల పంపిణీ

పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్ తర్లుపాడు ప్రతినిధి)

  ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కును మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. తర్లుపాడు మండలం లోని జడ్పీహెచ్ హైస్కూల్ నందు వైయస్సార్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో  వైయస్సార్ ఆసరా రెండో విడత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి  హాజరయ్యారు వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు అంబరాన్ని అంటాయి. భారీ సంఖ్యలో మహిళలు గ్రామాల నుండి తరలి వచ్చారు. అక్కా చెల్లెమ్మలకు జగనన్న వరాలు జల్లు సంఘ సభ్యులకు ఆనంద పరవళ్ళు విల్లు విరిశాయి. తర్లుపాడు మండల పరిధిలోని 590 గ్రూపుల కు  గాను 4,0018,775 రూపాయలు విడుదల అయినట్లు ఏ పీ ఎం డి పిచ్చయ్య తెలియజేశారు.


కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మలు సుఖంగా ఉండాలని కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. అని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  సంక్షేమ పథకాల లబ్ది కొరకు దాదాపు సంవత్సర కాలంలో ఎన్నో పథకాలు అమలు పరిచారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళ ఎంతో ఎత్తుకు ఎదగాలని వచ్చిన డబ్బులను వృధా చేయకుండా పిల్లల చదువులకు గాని, గ్రూపులుగా ఏర్పడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని  ఆయన అన్నారు. వైయస్ ఆసరా చెక్కును వైయస్సార్ కాంతి పథకం గ్రూప్ లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తర్లుపాడు క్లస్టర్ కోఆర్డినేటర్ రవికుమార్, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ఎంపీడీవో నరసింహులు, ఎమ్మార్వో  శైలేంద్ర కుమార్, జెడ్పిటిసి అధ్యక్షురాలు వెన్న ఇందిరా, ఎంపీటీసీ సభ్యులు మరియు జెడ్ పి టి సి సభ్యులు, సర్పంచులు , అధిక సంఖ్యలో మండల గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: