కేతగుడిపి గ్రామంలో,,,

డాక్టర్ వైయస్ఆర్ పొలం బడి 

హాజరైన రైతులు


(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా  తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం రైతు భరోసా కేంద్రం నందు డాక్టర్ వైయస్ఆర్ పొలం బడి సమావేశం. ఈ సమావేశం నందు వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ రమాదేవి గారు  మరియు మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖరరావు గారు , గ్రామ  వ్యవసాయ సహాయకులు మరియు గ్రామ రెవెన్యూ అధికారి  గ్రామ రైతులు హాజరైనారు. ఈ సమావేశం నందు పొలంబడి కి సంబంధించిన  వివరములు రైతులకు  తెలియపరిచారు. పొలంబడి సమావేశానికి హాజరైన సబ్ డివిజన్ మార్కాపురం వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సిహెచ్ రమాదేవి గారు హాజరైనారు. పొలం బడి సమావేశంలో పంటపొలాలను, దుక్కి దున్ని నుంచి, విత్తనం వేసే వరకు చేపట్టవలసిన  చర్యలను వివరించారు.


మనం వాడే వస్తువులు, పురుగుమందులు, ఎంత మోతాదులో వేయాల్సి ఉంటుంది. దాని గురించి వివరించడం జరిగినది. అదేవిధంగా పంట నమోదు మరియు ముఖ్యంగా వంట వ్యాలీడెషన్ కు సంబంధించిన వివరాలను తెలియపరచి వాటి వలన వచ్చే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారములు, పంట ఉత్పత్తులు, గిట్టుబాటు మద్దతు ధరలు వర్తించును అని తెలియజేశారు. మరియు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రం నందు ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నాము అని తెలియజేసియున్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: