రైతు భరోసా కేంద్రాలలో...

శనగ విత్తనాలు పంపిణీ


(జానో జాగో వెబ్ న్యూస్_ తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలములోని సీతానాగులవారం, తర్లుపాడు, మీర్జపేట గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాలలో శెనగల విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా సీతానాగులవారంలోని రైతుభరోసా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా మార్కాపురం ఎ.డి.ఎ. , ఎ.ఓ., తర్లుపాడు ఎం.పి.పి. భూలక్ష్మీ, సీతానాగులవారం సర్పంచ్ తాటికొండ ఆంజనేయులు,  వైసిపీ నాయకులు దాసయ్య, అంకయ్య, వి.ఎ.ఎ.లు, ఎం.పి.ఇ.ఓ..లు మరియు సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

     ఈ కార్యక్రమములో ఎ.డి.ఎ.గారు మాట్లాడుతూ రైతులు సబ్సిడి విత్తనాలను వినియోగించుకోవాలని, అలాగే పంటవేసిన ప్రతిఒక్క రైతు ఈ-క్రాప్ చేయించుకోవాలని సూచించారు. అలాగే రైతులకు శెనగ పంటలపై అవగాహన కల్పించారు. తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ  వ్యవసాయశాఖలోని పధకాలైన సి.హెచ్.సి. రైతుభరోసా, పి.ఎం.కిసాన్ మరియు రైతుభరోసాలలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల గురించి రైతులకు చెప్పారు. అలాగే రైతులు రైతుభరోసా కేంద్రాలలో సబ్సిడిలో విక్తనాల పంపిణీ జరుగుతుంది, కాబట్టి రైతులు పేమెంట్స్ స్లిప్స్ తెచ్చుకొని విత్తనాలు తీసుకొవాలని సూచించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: