మహమ్మద్ ప్రవక్త (స.అ.స) పవిత్ర జన్మ దినం పురస్కరిం చుకుని,,,

 మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యం లో అన్నదానం


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

మహమ్మద్ ప్రవక్త (స.అ.స) పవిత్ర జన్మ దినం పురస్క రించుకుని జిల్లా ఎమ్.పి.జె అధ్య క్షులు ఎస్.కే. ఖాసిమ్ నాయకత్వం లో పలు సేవా కార్య క్రమాలు చేపట్టారు. ప్రధానంగా స్థానిక  అనాధాశ్ర మాలు, వృద్ధా శ్రమాలలో, పేదలకు  పండ్లు, భోజనం  వితరణ చేశారు. ఈ సందర్భం గా జిల్లా ఎమ్.పి.జె అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశా యని పేర్కొన్నారు.

 

మానవుడి పుట్టుక నుండి మరణం వరకు సమాజం లో ఎలా మెలగాలో మార్గదర్శనం చేశారని తెలిపారు. మరణానంతరం కూడా జీవితం ఉంటుందని, అప్పుడు మన తప్పొప్పులు లెక్కించ బడతాయని, పుణ్యం చేసిన వారు స్వర్గానికి మరియు పాపం చేసిన వారు నరకానికి వెళతారని, ప్రవక్త సూచించారని తెలిపారు. ఈ కార్య క్రమం లో  ఎమ్.పి.జె జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్.ఏ. గఫార్,  కోశాధికారి ఎమ్.డి. హకీమ్, సహాయ కార్యదర్శి జమీల్,  మీడియా సెక్రటరీ చక్రి, సభ్యులు యాసర్, ఖాదర్, అన్వర్, శ్రీనివాస్, పోతుగంటి వెంకటేశ్వర్లు, గౌస్, అబ్బాస్, హుసేన్ మియా, యాసిన్ తది తరులు పాల్గొన్నారు.


 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: