దోపిడీ, కబ్జా, దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే,, 

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం కావాలి

ఆంధ్ర బహుజన ప్రజావేదిక

(జానో జాగో వెబ్ న్యూస్_ తిరుపతి ప్రతినిధి)

దోపిడీ, కబ్జా, దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే,, బహుజన రాజ్యాధికారమే లక్ష్యం కావాలి అని ఆంధ్ర బహుజన ప్రజావేదిక పేర్కొంది. తిరుపతిలో యూత్ హాస్టల్ నందు చిత్తూరు జిల్లా కన్వీనర్ ఎం.రాజబాబు ఆధ్వర్యంలో  నిర్వహించిన "కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రస్థాయి రాజకీయ విస్తృత సమావేశం" నందు ముఖ్యఅతిథి రాష్ట్ర నాయకుడు కె.అర్ హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ దోపిడీ, కబ్జా, దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలి. ఎందుకంటే చట్టసభల్లో రెండు లేక మూడు కులాలవారే తమ తోటి కులాల వారి హక్కుల్ని దోపిడీ చేస్తూ ఎక్కువ సీట్లను కలిగి ఉన్నారు. వీరు ఎక్కువ మంది ఉండడంవల్లే దోపిడిదారులుగా మారుతున్నారు. తమ కులపోళ్ళకే ఉద్యోగాలలోను, వ్యాపారాలలోను ప్రోత్సహిస్తున్నారు.

తమవాళ్ళకే కాంట్రాక్టులు, గనులు దోచిపెడుతున్నారు. అధికారుల్ని, ఉద్యోగుల్ని, జర్నలిస్టుల్ని బెదిరించి తమ పనులు చేయించుకుంటున్నారు. కనుక జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు, అన్ని రంగాల్లో అవకాశాలు వస్తే పైకనబరిచిన అవినీతి తగ్గిపోతుంది. ఆ కులాల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అలాగే మిగతా కులాల వారందరికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో సమాన అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా సమసమాజం ఏర్పడుతుంది. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అభ్యుదయభావాలు ఉన్నవారు ఏకమౌదామని పిలుపునిస్తున్నాం.

               జాతీయ పార్టీలు ప్రచారం చేసే మత దేశభక్తి, రాష్ట్ర పార్టీలు అభివృద్ధి పేరుతో సాగించే దోపిడీ, రాష్ట్రంలోని భూముల్ని విదేశీ కంపెనీలకు తాకట్టుపెట్టడం, ఉచిత పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం, రాష్ట్ర ఖజానాను దివాళా తీయించడం, కార్పొరేటు కంపెనీల కొమ్ముకాయడం, ఓట్లను, ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనడం, పార్టీ ఫిరాయింపులు, అవినీతి ఇవి అన్నీ దేశ ప్రయోజనాలను దెబ్బతీసేవి. రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధమైనవి.

              సహజవనరులైన గ్రానైట్, బాక్సైట్, ఇసుక ఇలా ప్రతి ఒక్కదానిపై హక్కు ప్రజలది. వాటిపై వచ్చే ఆదాయంతో ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉచితంగా కట్టించవచ్చు. కానీ వీటినన్నింటిని దోపిడీ కులపాలకులు తమ వారికే కట్టబెడుతూ వాటిపై వచ్చే ఆదాయాన్ని దోచుకుంటున్నారు. దీనితోనే ఎన్నికల్లో వారు ప్రజల ఓట్లను కొంటున్నారు. ఈ వనరుల దోపిడీవల్ల రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతోంది. వీటిపై ఆదాయం ప్రభుత్వానికి వచ్చినప్పుడే 85శాతంపైన ఉన్న బహుజనులకు లాభం చేకూరుతుంది. 

 


                ఈ రోజు ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించి దోపిడిదారులకు కాపలాగా, ఏజెంటుగా మారిపోతోంది. దీనివలన ప్రయివేటు రంగాల్లో బహుజనులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. కారణం ఆ కంపెనీలు దోపిడీ కులపోళ్ళవి, వాళ్లు, వాళ్ల కులపోళ్ళకే అవకాశాలు కల్పిస్తారు. బహుజనులకు రిజర్వేషన్లు ఎగ్గొట్టి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని నిన్నమొన్నటి వరకు ఈ దోపిడీ కులపోళ్ళు అనుభవించారు. ఇప్పుడు బహుజనుల్లో చైతన్యం పెరుగుతుండడంతో మొత్తం ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి తమ కులపోళ్ళ ప్రయివేటు కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు.

               ప్రజలకు ఉచిత విద్య, వైద్యంతోపాటు కల్తీ నిరోధం బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా తమ కులపోళ్ళ ప్రయోజనాల కోసం కార్పొరేటు విద్యను, వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, నేటి అమ్మఒడి వంటి పథకాలతో ప్రజాధనాన్ని తమ దోపిడీ కులపోళ్లకు దోచిపెడుతున్నారు. ఈ రోజు కల్తీ ఎరువులు, కల్తీమందులు, కల్తీ ఆహారం, కల్తీ పురుగు మందులు విటినన్నింటిని తయారు చేస్తుండేది ఈ దోపిడీ కులపోళ్లే. ప్రభుత్వ యంత్రాంగం ఇంత ఉండి కూడా ఈ కల్తీరాయుళ్ల ఆటలు అరికట్టలేకపోవడానికి కారణం కేవలం కులపిచ్చి. తమ కులపిచ్చితో ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నా ప్రభుత్వంలోని దోపిడీ కులనేతలు నోరు మెదపడం లేదు. వీటన్నింటినీ ప్రజలకు తెలియజేసి రాజ్యాంగ ఫలాలను సాధించడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులు, అభ్యుదయవాదులు అందరూ ఏకమై "బహుజన రాజ్యాధికారం" సాధించుకుంటే, పై కనబరిచినవి జనాభా దామాషా ప్రకారం పంచుకోవచ్చు. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అభ్యుదయవాదులు మాతో కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.

          ఇందులో పాల్గొన్నవారు:- రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, వినాయకరెడ్డి, రాష్ట్ర నాయకులు యాటగిరి ప్రసాద్, కె.ఆర్.హరిప్రసాద్, కె.సాయిశీనా, చిత్తూరు జిల్లా మహిళా కన్వీనర్ కె.పి.సరోజ, జి.మహాలక్ష్మి, ఎస్.జమున, ఎ.జయంతి, పి.జ్యోతి, టి.హేమలత, బి.రమేష్, వెంకటేష్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కినిపల్లి లక్ష్మయ్య, శ్రీనివాసులు, గిరి శ్రీనివాసులు, ఎ. జగన్నాథ్ తదితరులు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: