ఉత్తరప్రదేశ్ లో మరణించిన,,

రైతు అమరవీరులకు పుష్పాంజలి

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

ఉత్తరప్రదేశ్ లకింపూర్ లో వ్యవసాయం  చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువ రైతాంగం పై కారుతో తోక్కించి  హత్య చేసినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు డికెయం.రఫీ అన్నారు .ఆదివారం స్థానిక పాత బస్టాండ్ గడియారం స్తంభం సెంటర్ వద్ద సిఐటియు, వ్యవసాయకార్మికసంఘం, ఎం పి జె, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఆవాజ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అమరులైన రైతుల చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల పై జరిగిన దాడి పై మోడీ నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. నాలుగురు  రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కుమారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులు తమ న్యాయమైన డిమాండ్ పై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే

 మోడీ ప్రభుత్వం వారిని కించపరిచే, అవమానకరంగా ఉగ్రవాదులని, పాకిస్తాన్ నుంచి సహాయం అందుతుందని రైతు ఉద్యమాన్ని కించపరచడం న్ని వారు వ్యతిరేకించారు. దేశభక్తులను అంటూ గొప్పలు చెప్పే మోడీ గారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు, కార్పొరేటర్స్ అప్ప చెప్పడమే దేశభక్తా ? అని విమర్శించారు. ఇంతపెద్ద దేశానికి ప్రభుత్వ రంగంలో విమానయానం లేని దేశంగా చరిత్రకెక్కాడం ఇది ఒక మోడీగారి కే సాధ్యమైందని అన్నారు. దేశంలోని ప్రభుత్వ విమాన యానాన్ని టాటాకు అమ్మేయడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి రూబెన్, కే సుబ్బరాయుడు, ఎస్.కె. ఇ మాంసా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి సోమయ్య, ఎం పీ జే రాష్ట్ర కోశాధికారి ఎస్కే రజాక్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యేనుగుల.సురేష్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు లోకేష్, ఆవాజ్ నాయకులు షేక్ జబ్బార్, ఎస్కే నన్నేసా, ఇనూస్, జనుమాల నాగయ్య పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: