విద్యలో కేంద్ర పెత్తనాన్ని నిలదీద్దాం...

రాష్ట్ర హక్కుల కోసం పోరాడుదాం

12 రాష్ట్రాల సీఎంలకు,,, తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ


(జానో జాగో వెబ్ న్యూస్_సెంట్రల్ డెస్క్)

విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించదామని, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుదామని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుదామని ఆయన కోరారు.  ప్రధానంగా నీట్ ప్రస్తావన, ఏకే రాజన్ కమిటీ నివేదికను పంచుకున్న ఆ లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో... విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. 

విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పేర్కొన్నారు.  కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని వివరించారు.  తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు.  దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు.  అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: